Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Gambhir vs Sreesanth మధ్య ఆగని గొడవ.. ఆ దేవుడు కూడా క్షమించడు బ్రదర్!

Gambhir vs Sreesanth: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, మాజీ పేసర్ శ్రీశాంత్ మధ్య చోటు చేసుకున్న గొడవ ఇప్పట్లో ఆగేలా లేదు. మైదానంలో వాదులాడుకున్న ఈ సీనియర్ ఆటగాళ్లు.. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దానికి తెరలేపారు. ఈ గొడవను ఉద్దేశించిన గంభీర్ క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేయగా.. శ్రీశాంత్ తనదైన శైలిలో బదులిచ్చాడు.

'ప్రపంచం మొత్తం మీ మీద దృష్టి పెట్టిన సందర్భంలో ఒక స్మైల్ ఇవ్వండి'అంటూ తాను నవ్వుతున్న ఫొటో‌ను గంభీర్ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌పై శ్రీశాంత్ ఘాటుగా స్పందించాడు. సహచర ఆటగాళ్లకు గౌరవం కూడా ఇవ్వని వ్యక్తి నవ్వు గురించి మాట్లాడుతున్నాడని మండిపడ్డాడు.

Sreesanth gives befitting reply to Gautam Gambhir’s cryptic post

'మీరు ఓ క్రీడాకారుడు, ప్రజాప్రతినిథి. అలాంటి మీరు హద్దులు ధాటి ప్రవర్తించారు. ప్రతీ క్రికెటర్‌తో గొడవపడుతూనే ఉన్నారు. అసలు నీతో నాకున్న సమస్య ఏంది? నేను నవ్వుతూనే మీ వైపు చూశాను. కానీ మీరు ఫిక్సర్ నన్ను సంబోధించారు. నిజంగా నేను ఫిక్సర్‌నా? సుప్రీం కోర్టు కంటే మీరు ఎక్కువనా..? ఇలా మాట్లాడేందుకు నీకు ఎలాంటి అధికారాలు లేవు.

చివరకు నువ్వు అంపైర్లను కూడా అసభ్య పదజాలంతో దూషించావు. అలాంటి నువ్వు నవ్వు గురించి మాట్లాడుతున్నావా? నువ్వో అహంకారివి. నీకు మద్దతు ఇచ్చే వారి పట్ల కూడా మర్యాదగా నడుచుకోవు. నిన్నటి వరకు నీవు.. నీ కుటుంబ అంటే నాకు చాలా గౌరవం ఉండేది. కానీ నువ్వు ఫిక్సర్ అని అవమానకరమైన పదాన్ని వాడి నా గౌరవాన్ని కోల్పోయావు.

ఒకసారే కాకుండా ఫిక్సర్ అని 7-8 సార్లు అన్నావు. ఫ*అనే బూతు పదాన్ని కూడా వాడావు. నీ మాటలతో నన్ను రెచ్చగొట్టావు. నా ప్లేస్‌లో మరే వ్యక్తి ఉన్నా.. నిన్ను క్షమించరు. నువ్వు చేసిన తప్పిదం ఏంటో నీ మనస్సాక్షికి తెలుసు. నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. ఆ ఘటన తర్వాత నువ్వు మళ్లీ మైదానంలోకి కూడా రాలేదు. ఆ దేవుడు అన్నీ చూస్తున్నాడు.'అని శ్రీశాంత్.. గంభీర్ పోస్ట్‌కు సుదీర్ఘ కామెంట్ పెట్టాడు.

లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ లెజెండరీ ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. అంపైర్లు సర్దిచెప్పినా.. సహచర ఆటగాళ్లు వారించినా వెనక్కి తగ్గలేదు. ఈ గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇండియా క్యాపిటల్స్ జట్టును గౌతమ్ గంభీర్ నడిపిస్తుండగా.. గుజరాత్ జెయింట్స్ జట్టుకు శ్రీశాంత్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
అయితే ఇండియా క్యాపిటల్స్ బ్యాటింగ్ సందర్భంగా శ్రీశాంత్ వేసిన రెండో ఓవర్‌లో గౌతమ్ గంభీర్ తొలి రెండు బంతులను 6, 4 గా బౌండరీకి తరలించాడు.

దాంతో శ్రీశాంత్ అసహనానికి గురయ్యాడు. ఇద్దరూ ఒకరినొకరు సీరియస్‌గా చూసుకున్నారు. ఆ తర్వాత శ్రీశాంత్ ఫీల్డింగ్ చేస్తుండగా.. అతన్ని ఉద్దేశించి గంభీర్ ఏవో వ్యాఖ్యలు చేశాడు. దాంతో శ్రీశాంత్ ఏం అంటున్నావ్ అంటూ సీరియస్ అయ్యాడు.

Story first published: Thursday, December 7, 2023, 22:32 [IST]
Other articles published on Dec 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+