ఒలింపిక్స్‌లో కోహ్లీని ఆడించాలి.. అతనితో కలిస్తే దబిడి దిబిడే: శ్రీశాంత్
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ 2028లో విరాట్ కోహ్లీని ఆడించాలని టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సూచించాడు. విరాట్ కోహ్లీ క్లాస్ బ్యాటింగ్‌కు టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం తోడైతే టీమిండియాకు తిరుగుండదని శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు.
128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యంగా టీమిండియా సిద్దమవుతోంది. విశ్వక్రీడల్లో బరిలోకి దిగే భారత క్రికెట్ టీమ్ కూర్పుపై చర్చ మొదలైంది.
ఒలింపిక్స్‌లో కోహ్లీని ఆడించాలి..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన శ్రీశాంత్.. ఒలింపిక్స్ ఆడేలా విరాట్ కోహ్లీని ఒప్పించాలని సెలెక్టర్లకు సూచించాడు. 'మనం ఒలింపిక్ స్వర్ణం గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి మెగా టోర్నీలో విరాట్ కోహ్లీ తప్పకుండా ఆడాలని నేను అభ్యర్థిస్తున్నాను. అతని అపార అనుభవం, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లాంటి కుర్రాడి దూకుడు కలిస్తే ఆ జట్టు అద్భుతంగా ఉంటుంది. సీనియర్, జూనియర్ ఆటగాళ్ల కలయికతో జట్టును బలోపేతం చేయవచ్చు.

విరాట్ కోహ్లీకి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా.. ఒలింపిక్స్ ఆడేలా అతన్ని సెలెక్టర్లు ఒప్పించాలి. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇది వివాదాస్పదం కావొచ్చు.. కానీ దయచేసి విరాట్‌ను ఒలింపిక్స్ జట్టులోకి తీసుకోండి అని సెలక్టర్లను కోరుతున్నాను'అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.
వైభవ్ సూర్యవంశీ పక్కా..
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం అంతర్జాతీయ టీ20లకు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2026 సీజన్‌లో అద్వితీయమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన వైభశ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో 776 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా వైభవ్ సత్తా చాటితే ఒలింపిక్స్ జట్టులో ఉంటాడు.
1900 సంవత్సరం తర్వాత మళ్లీ ఇప్పుడే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేశారు. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో ఆరు జట్ల చొప్పున టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్‌లను కూడా చేర్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications