Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Rankings: వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా తెలుగమ్మాయి శ్రీచరణి

భారత స్పిన్నర్, తెలుగు తేజం శ్రీచరణి చరిత్ర సృష్టించింది. వరల్డ్ నెంబర్ వన్ టీ20 బౌలర్‌గా నిలిచింది. ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మహిళా క్రికెటర్‌గా శ్రీచరణి గుర్తింపు పొందింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి అగ్రస్థాన్నాన్ని అందుకుంది. ఇంగ్లండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను అధిగమించి ఈ ఫీట్ సాధించింది.

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో మూడు మ్యాచ్‌లు ఆడిన శ్రీచరణి 10 వికెట్లు పడగొట్టింది. గతేడాది జూన్ 28న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టిన శ్రీచరణి.. అనతికాలంలోనే వరల్డ్ నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచింది. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌లో శ్రీచరణి 14 వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. భారత సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ మూడు స్థానాలు దిగజారి 8వ ర్యాంకులో నిలిచింది. పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల ఘనత సాధించినా.. దీప్తి శర్మ టాప్-5 ప్లేస్ కోల్పోయింది.

Sree Charani Crowns Herself World No 1 T20I Bowler Just One Year After International Debut

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచిన శ్రీచరణిని ఏపీ మంత్రి నారా లోకేశ్ అభినందించారు. సోషల్ మీడియా వేదికగా శ్రీచరణిపై ప్రశంసల జల్లు కురిపించారు. గతేడాదే శ్రీచరణితో మాట్లాడానని, క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆమె చెప్పిన విషయాలు ఇంకా గుర్తున్నాయని తెలిపారు. ప్రతిభ, పట్టుదల, కఠోర శ్రమ ఉంటే.. ప్రతిఫలం తప్పక లభిస్తుందని చెప్పడానికి శ్రీచరణి నిదర్శనమన్నారు. యావత్ రాష్ట్రం శ్రీచరణిని చూసి గర్విస్తోందని, మరిన్ని రికార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై భారీ విజయాలు సాధించిన భారత్.. సౌతాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్‌లను బంగ్లాదేశ్‌తో పాటు పటిష్టమైన ఆస్ట్రేలియాలతో ఆడాల్సి ఉంది. భారత్ సెమీస్ చేరాలంటే.. పటిష్టమైన ఆస్ట్రేలియాను భారత మహిళల జట్టు ఓడించాలి. లేదంటే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. జూన్ 25న బంగ్లాదేశ్‌తో, జూన్ 28న ఆస్ట్రేలియాతో భారత తమ చివరి లీగ్ మ్యాచ్‌లను ఆడనుంది.

Story first published: Tuesday, June 23, 2026, 18:16 [IST]
Other articles published on Jun 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+