For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసు ముందు వరసలో లాల్‌చంద్ రాజ్‌పుత్

Lalchand Rajput Now Eyeing Team India Batting Coach Job

ముంబై: టీమిండియా హెడ్ కోచ్‌గా తిరిగి రవిశాస్త్రి ఎంపికయిన విషయం తెలిసిందే. కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహాదారుల కమిటీ ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రినే కొనసాగించగా.. సహాయక సిబ్బంది నియామక ప్రక్రియను చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సెలక్షన్ కమిటీ ప్రారంభించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లతో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ను ప్రసాద్‌ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం నుంచి ఇంటర్వ్యూలు మొదలయ్యాయి.

బంగర్‌ పనితీరుపై విమర్శలు:

బంగర్‌ పనితీరుపై విమర్శలు:

ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పనితీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆ పదవి కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. టీమిండియా ప్రధాన కోచ్‌ అవకాశం దక్కని లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఇప్పుడు బ్యాటింగ్‌ కోచ్ రేసులో నిలిచాడు. జింబాబ్వే, ఆఫ్ఘనిస్థాన్ జాతీయ జట్లకు కోచ్‌గా పనిచేసిన రాజ్‌పుత్.. సొంత జట్టుకు ఎలాగైనా సేవలదించేందుకు సిద్ధమయ్యాడు.

రేసులో లాల్‌చంద్‌:

రేసులో లాల్‌చంద్‌:

రాజ్‌పుత్‌, విక్రమ్‌ రాఠోడ్‌, ప్రవీణ్‌ ఆమ్రే, అమోల్‌ మజుందార్‌, సితాంషు కొటక్‌, హృషికేశ్‌ కనిత్కర్‌, మిథున్‌ మన్హాస్‌ బ్యాటింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ జాబితాలో మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోడ్ కూడా ముందు వరసలో ఉన్నాడట. మరి ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.

భరత్‌ అరుణ్‌కే అవకాశం:

భరత్‌ అరుణ్‌కే అవకాశం:

ప్రస్తుత బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌లు తిరిగి ఎంపికవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి సైతం వీరికి అండగా ఉన్నాడని సమాచారం. భరత్ అరుణ్ నేతృత్వంలో టీమిండియా బౌలింగ్ చాలా మెరుగైంది. ముఖ్యంగా పేస్ విభాగంలో మరింత బలోపేతమైంది. దీంతో అరుణ్ పదవి పదిలంగానే ఉండనుంది. అయితే బౌలింగ్‌ కోచ్‌ పదవి కోసం వెంకటేశ్‌ ప్రసాద్‌, పారస్‌ మాంబ్రే, అమిత్‌ భండారీలు పోటీ పడుతున్నారు.

విజ్జీ ట్రోఫీ నుండి వైదొలిగిన జమ్మూకాశ్మీర్

శ్రీధర్ వైపే మొగ్గు:

శ్రీధర్ వైపే మొగ్గు:

ఆర్.శ్రీధర్ పర్యవేక్షణలో భారత జట్టు ఫీల్డింగ్ కూడా గత కొంత కాలంగా ఉన్నత ప్రమాణాలతో ఉంది. ఆటగాళ్లు మెరుపు ఫీల్డింగ్‌ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ, జడేజా, రోహిత్ రాహుల్ ఫీల్డింగ్ మరింత మెరుగైంది. ఈ నేపథ్యంలో జాంటీ రోడ్స్ పోటీలో ఉన్నా.. ఎమ్మెస్కే కమిటీ శ్రీధర్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ పదవులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10 టెస్టులు లేదా 25 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. ఇక 60 ఏళ్లలోపు వయసుండాలి.

Story first published: Tuesday, August 20, 2019, 13:18 [IST]
Other articles published on Aug 20, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+