Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sports calendar 2026: అభిమానులకు పండగే.. ఫిఫా నుంచి టీ20 ప్రపంచకప్ వరకు పూర్తి షెడ్యూల్ ఇదే!

క్రీడాభిమానులకు నూతన సంవత్సరం 2026 ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి ప్రపంచం మెచ్చే ఫిఫా వరల్డ్ కప్ వరకు ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీలకు 2026 వేదికగా నిలవనుంది. వింటర్ ఒలింపిక్స్‌తో పాటు కామన్వెల్త్ గేమ్స్ కూడా 2026లోనే సందడి చేయనున్నాయి. మరికొద్దీ గంటల్లో యావత్ ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనుంది.

ఈ శుభ సందర్భంగా మైఖేల్ తెలుగు.. తమ అభిమానుల కోసం స్పోర్ట్స్ క్యాలెండర్ 2026‌ను మీ మందుకు తీసుకొచ్చింది. పలు ప్రపంచకప్ టోర్నీల నేపథ్యంలో 2026ను అభిమానులు ప్రపంచకప్ నామ సంవత్సరంగా గుర్తు పెట్టుకోనున్నారు.

Sports Calendar 2026 Month-by-Month Schedule of Major Global Tournaments With Dates and Venues

2026‌కు సంబంధించిన పూర్తి క్రీడా క్యాలెండర్:

1.జనవరి: మెల్‌బోర్న్ కోర్టులో టెన్నిస్ సందడి

ఆస్ట్రేలియన్ ఓపెన్: జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి ఆరంభం వరకు (మెల్‌బోర్న్).

ICC అండర్-19 పురుషుల వరల్డ్ కప్: జనవరి 15 - ఫిబ్రవరి 6 (జింబాబ్వే, నమీబియా).


2. ఫిబ్రవరి: మంచు కొండల్లో ఒలింపిక్స్.. భారత గడ్డపై వరల్డ్ కప్

వింటర్ ఒలింపిక్స్: ఫిబ్రవరి 6 - 22 (మిలన్-కోర్టినా, ఇటలీ).

ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్: ఫిబ్రవరి 7 - మార్చి 8 (భారత్, శ్రీలంక సంయుక్తంగా).

సూపర్ బౌల్ LX (NFL): ఫిబ్రవరి 8 (కాలిఫోర్నియా, USA).

3. మార్చి: మోదీ స్టేడియంలో ప్రపంచ కప్ ఫైనల్.. ఐపీఎల్ హంగామా షురూ..

టీ20 వరల్డ్ కప్ ఫైనల్: మార్చి 8 (అహ్మదాబాద్).

F1 సీజన్ ప్రారంభం: మార్చి 8 (ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి).

వరల్డ్ బేస్ బాల్ క్లాసిక్: మార్చి 5 - 17.

చెస్ (FIDE) కాండిడేట్స్ టోర్నమెంట్: మార్చి 28 - ఏప్రిల్ 16 (సైప్రస్).

IPL (ఐపీఎల్): మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు.

4.ఏప్రిల్, మే: గోల్ఫ్, ఫ్రెంచ్ ఓపెన్

ది మాస్టర్స్ (గోల్ఫ్): ఏప్రిల్ 9 - 12 (జార్జియా, USA).

ఫ్రెంచ్ ఓపెన్ (టెన్నిస్): మే నెలాఖరు - జూన్ ప్రారంభం (పారిస్).

ఐపీఎల్ (IPL) ఫైనల్: మే చివర్లో.

UEFA ఛాంపియన్స్ లీగ్ ఫైనల్: మే 30 (బుడాపెస్ట్).

5. జూన్, జూలై: ఫుట్‌బాల్ ప్రపంచకప్

ఫిఫా వరల్డ్ కప్: జూన్ 11 - జూలై 19. చరిత్రలో తొలిసారిగా 48 జట్లతో (అమెరికా, కెనడా, మెక్సికో వేదికలుగా).

మహిళల టీ20 వరల్డ్ కప్: జూన్ 12 - జూలై 5 (ఇంగ్లాండ్).

వింబుల్డన్: జూన్ నెలాఖరు - జూలై మధ్య వరకు (లండన్).

కామన్వెల్త్ గేమ్స్: జూలై 23 - ఆగస్టు 2 (గ్లాస్గో, స్కాట్లాండ్).

టూర్ డి ఫ్రాన్స్ (సైక్లింగ్): జూలై 4 - 26.

6.ఆగస్టు: హాకీ, బ్యాడ్మింటన్ సమరం

FIH హాకీ వరల్డ్ కప్: ఆగస్టు 14 - 30 (నెదర్లాండ్స్, బెల్జియం).

BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ (బ్యాడ్మింటన్): ఆగస్టు నెలాఖరు (న్యూఢిల్లీ).

యుఎస్ ఓపెన్ (టెన్నిస్): ఆగస్టు నెలాఖరు - సెప్టెంబర్ ప్రారంభం (న్యూయార్క్).

7. సెప్టెంబర్: ఆసియా క్రీడల నగారా

ఆసియా క్రీడలు (Asian Games): సెప్టెంబర్ 19 - అక్టోబర్ 4 (ఐచి-నాగోయా, జపాన్).

డైమండ్ లీగ్ ఫైనల్స్ (అథ్లెటిక్స్): సెప్టెంబర్ 4 - 5 (బ్రస్సెల్స్).

FIBA మహిళల బాస్కెట్‌బాల్ వరల్డ్ కప్: సెప్టెంబర్ 4 - 13 (బెర్లిన్).

8. నవంబర్, డిసెంబర్: ముగింపు వేడుకలు

WTA, ATP ఫైనల్స్ (టెన్నిస్): నవంబర్ మధ్యలో (సౌదీ అరేబియా).

F1 సీజన్ ముగింపు: డిసెంబర్ 4 - 6 (అబుదాబి).

BWF వరల్డ్ టూర్ ఫైనల్స్: డిసెంబర్ 9 - 13 (చైనా).

ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 2026: (తేదీలు, వేదిక ఖరారు కావాల్సి ఉంది).

Story first published: Tuesday, December 30, 2025, 17:54 [IST]
Other articles published on Dec 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+