Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

21 బంతుల్లోనే సెంచరీ.. 18 సిక్సర్లతో వీర విహారం! (వీడియో)

స్పానిష్ క్రికెటర్ అస్జద్ బట్ చరిత్ర సృష్టించాడు. 21 బంతుల్లోనే సెంచరీ సాధించి క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. యూరోపియన్ క్రికెట్ సిరీస్‌(యూసీఎస్) టీ10 టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో అస్జద్ బట్ ఈ ఫీట్ సాధించాడు. కాటలున్యా డ్రాగన్స్, సోహల్ హాస్పిటలెట్ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ వరల్డ్ రికార్డ్ నమోదైంది.

సోహాల్ హాస్పిటలెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అస్జద్ బట్.. 27 బంతుల్లో 128 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కాటాలున్యా డ్రాగన్స్ నిర్ణీత 10 ఓవర్లలో 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన హాస్పిటలైట్.. అస్జద్ బట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అధిగమించి సునాయస విజయాన్నందుకుంది.

Spanish cricketer Asjad Butt slams 21-ball century in European T10 cricket

అస్టద్ బట్ తన ఇన్నింగ్స్‌ల్లో 18 సిక్స్‌లు, 4 ఫోర్లు బాదాడు. ఇదే లీగ్‌లో 25 బంతుల్లో శతకాన్ని అందుకున్న మార్స్టా సీసీ ఓపెనర్ షేర్ అలీ రికార్డును అస్జద్ బట్ తాజా ఇన్నింగ్స్‌తో అధిగమించాడు. అస్జద్ బట్ 474 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ప్రస్తుతం అతని బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కుశాల్ మల్లా, డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ, సమర విక్రమాల పేరుపై ఉంది. వీరంతా 35 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశారు. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. అతను 31 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.

Story first published: Thursday, February 22, 2024, 17:22 [IST]
Other articles published on Feb 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+