FIFA World Cup 2026: ఆస్ట్రియాపై ఘన విజయం.. ప్రిక్వార్టర్స్‌కు స్సెయిన్
ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీలో స్పెయిన్ దుమ్మురేపుతోంది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన నాకౌట్ పోరులో స్పెయిన్ 3-0తో ఆస్ట్రియాను చిత్తు చేసింది. ఈ విజయంతో ప్రిక్వార్టర్స్‌కు స్పెయిన్ అర్హత సాధించగా.. ఆస్ట్రియా పోరాటం ముగిసింది. స్పెయిన్ ఫార్వర్డ్ మైకెల్ ఒయర్జబల్ డబుల్స్ గోల్స్‌తో చెలరేగగా.. పెడ్రో పోర్రో మరో గోల్ అందించాడు. ప్రిక్వార్టర్స్‌లో స్పెయిన్.. పోర్చుగల్‌తో తలపడనుంది.
ఆరంభంలో వెనుకబడినా..
మ్యాచ్ ప్రారంభంలో స్పెయిన్ కాస్త నెమ్మదించినప్పటికీ, యువ సంచలనం లామిన్ యమల్, పెద్రీల అద్భుతమైన ఆటతీరుతో మ్యాచ్‌పై పట్టు సాధించింది. 29వ నిమిషంలో మార్క్ కుకురెల్లా కొట్టిన గోల్‌ను రెఫరీ తిరస్కరించినప్పటికీ స్పెయిన్ జోరు తగ్గలేదు. చివరకు 35వ నిమిషంలో కుకురెల్లా అందించిన లో-క్రాస్‌ను ఒయర్జబల్ అద్భుతమైన షాట్‌తో గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో 16 ఏళ్ల తర్వాత (2010 ఫైనల్ తర్వాత) స్పెయిన్ చేసిన మొదటి గోల్ ఇదే కావడం విశేషం.

రెండో భాగంలో ఆస్ట్రియా ఆటగాడు సాసా కాలాజ్దిచ్ హెడర్ ద్వారా గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ వెంటనే 66వ నిమిషంలో అలెక్స్ బేనా అందించిన క్రాస్‌ను పెడ్రో పోర్రో సూపర్ హెడర్‌తో గోల్‌గా మార్చడంతో స్పెయిన్ ఆధిక్యం 2-0కు చేరింది. మ్యాచ్ ముగియడానికి ఒక నిమిషం ముందు (89వ నిమిషంలో) కుకురెల్లా పాస్‌ను ఒయర్జబల్ మళ్లీ గోల్‌గా మలిచి స్పెయిన్‌కు 3-0తో తిరుగులేని విజయాన్ని ఖాయం చేశాడు.
రికార్డుల వేట:
ఈ మ్యాచ్‌లో గోల్ చేయకపోయినా 18 ఏళ్ల లామిన్ యమల్ తన డ్రిబ్లింగ్‌తో రికార్డు సృష్టించాడు. ఒకే ప్రపంచకప్ మ్యాచ్‌లో 10 కి పైగా డ్రిబ్లింగ్స్, బాక్స్‌లో 14 సార్లు బంతిని తాకిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. అలాగే 1986 తర్వాత స్పెయిన్ తరఫున ఒకే నాకౌట్ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన ఆటగాడిగా ఒయర్జబల్ నిలిచాడు. డిఫెన్స్‌లోనూ సత్తా చాటిన స్పెయిన్.. ఈ టోర్నీలో వరుసగా 4 మ్యాచ్‌ల్లో క్లీన్ షీట్ (ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వకపోవడం) నమోదు చేసిన జట్టుగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

