Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final 2025: ఆ ఒక్క తప్పిదమే సౌతాఫ్రికా కొంపముంచింది!

సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2025 ఆసక్తికరంగా మొదలైంది. లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ బిగ్ మ్యాచ్‌ తొలి రోజు ఆటలో పేసర్లు దుమ్మురేపారు. పిచ్‌ నుంచి లభించిన సహకారాన్ని ఇరు జట్ల బౌలర్లు అందిపుచ్చుకున్నారు. దాంతో తొలి రోజే 14 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా నిప్పులు చెరిగింది.

కగిసో రబడా(5/51), మార్కో యాన్సెన్(3/49) రఫ్ఫాడించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే కుప్పకూలింది. బ్యూ వెబ్‌స్టర్(92 బంతుల్లో 11 ఫోర్లతో 72), స్టీవ్ స్మిత్(112 బంతుల్లో 10 ఫోర్లతో 66) హాఫ్ సెంచరీలతో ఆసీస్‌ను ఆదుకున్నారు.

కష్టాల్లో సౌతాఫ్రికా..

అనంతరం సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 4 వికెట్లకు 43 పరుగులే చేసింది. యిడెన్ మార్క్‌రమ్(0), ర్యాన్ రికెల్టన్(16), వియాన్ మల్డర్(6), ట్రిస్టన్ స్టబ్స్(2) తీవ్రంగా నిరాశపరిచారు. క్రీజులో కెప్టెన్ టెంబా బవుమా(3 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడింగ్‌హమ్(8) ఉన్నారు. రెండో రోజు సౌతాఫ్రికా బ్యాటుతో ఏమేర పోరాడుతుందన్నదానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది. బౌలింగ్‌లో చెలరేగిన సౌతాఫ్రికా.. బ్యాటింగ్‌లో శుభారంభం అందుకోలేకపోయింది.

South Africa s Costly Blunder Hands Australia Significant Advantage in WTC Final 2025

ఘోర తప్పిదం..

అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేసిన ఓ తప్పిదం ఆస్ట్రేలియాకు కలిసి వచ్చింది. ఆస్ట్రేలియా తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచిన బ్యూ వెబ్‌స్టర్.. సఫారీ తప్పిదం కారణంగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రబడా వేసిన 29వ ఓవర్‌ రెండో బంతికి వెబ్‌స్టర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. సఫారీ ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. అంపైర్ స్పందించలేదు. అప్పటికే రెండు రివ్యూలు వృథా కావడంతో సౌతాఫ్రికా రివ్యూ తీసుకునే సాహసం చేయలేదు. కానీ రిప్లేలో ఔటని తేలింది.

సఫారీ ఆటగాళ్లు రివ్యూ తీసుకొని ఉంటే వెబ్‌స్టర్ 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దే ఔటయ్యేవాడు. కానీ సఫారీ ఆటగాళ్ల అలసత్వంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వెబ్‌స్టర్.. స్మిత్‌తో కలిసి ఏడో వికెట్‌కు 77 పరుగులు జోడించాడు. సఫారీ టీమ్ గనుక రివ్యూ తీసుకొని వెబ్‌స్టర్ ఔటై ఉంటే ఆసీస్ 150 పరుగులు కూడా చేసేది కాదు. కానీ సౌతాఫ్రికా టీమ్ ఘోర తప్పిదంతో మూల్యం చెల్లించుకుంది.

అతను చెప్పినా వినలేదు..

మ్యాచ్ అనంతరం తమ తప్పిదాన్ని రబడా అంగీకరించాడు. తన సహచర ఆటగాడు కార్బిన్ బోచ్ అది ఔటని చెప్పాడని, కానీ తానే వినిపించుకోలేదన్నాడు. వెబ్‌స్టర్ సానుకూలంగా కనిపించడంతో తాను రివ్యూ తీసుకోలేకపోయానన్నాడు. మరోవైపు స్మిత్.. రివ్యూ తీసుకోకపోవడం తమకు కలిసొచ్చిందన్నాడు. 'వాస్తవానికి ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ రివ్యూ తీసుకోకపోవడం మాకు మేలు చేసింది. బ్యూ వెబ్‌స్టర్‌ నొప్పితో బాధపడ్డాడు. బంతి ప్యాడ్‌కు కాకుండా కాలికి తగిలింది. వారికి రివ్యూ తీసుకునే అవకాశం ఉంది. కానీ తీసుకోలేదు.'అని స్మిత్ తెలిపాడు.

  • రివ్యూ తీసుకోకుండా ఘోర తప్పిదం చేసిన సౌతాఫ్రికా
  • సౌతాఫ్రికా తప్పిదంతో వద్ద ఔటవ్వకుండా బచాయించిన బ్యూ వెబ్‌స్టర్
  • స్మిత్‌తో కలిసి 6వ వికెట్‌కు 77 పరుగులు జోడించిన వెబ్‌స్టర్
  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212 ఆలౌట్
  • సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 43/4
Story first published: Thursday, June 12, 2025, 12:15 [IST]
Other articles published on Jun 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+