For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను చేసిన ఆ పనికి సిగ్గుపడుతున్నా.. దయచేసి క్షమించండి: దక్షిణాఫ్రికా కోచ్

South Africas coach Mark Boucher apologises for his singing offensive songs and nicknames
సొంత జట్టే Makhaya Ntini ని ఇంతలా అవమానించిందా | Mark Boucher Stats || Oneindia Telugu

డర్బన్‌: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌, ప్రస్తుత కోచ్ మార్క్‌ బౌచర్‌ క్షమాపణలు చెప్పాడు. బౌచర్‌ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్‌గా ఉన్న సమయంలో తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆ జట్టు మాజీ స్పిన్నర్‌ పాల్‌ ఆడమ్స్‌ ఆరోపించిన నేపథ్యంలో బౌచర్‌ తాజాగా స్పందించాడు. క్రికెట్‌ దక్షిణాఫ్రికా సోషల్‌ జస్టిస్‌ అండ్‌ నేషన్‌ బిల్డింగ్‌ (ఎస్‌జేఎన్‌)కు సమర్పించిన అఫిడవిట్‌లో బౌచర్‌.. తన మాజీ సహచరులకు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని, దయచేసి తనను క్షమించండని కోరుకున్నాడు.

 పాటలు పాడి, వారిని మారు పేర్లతో పిలుస్తూ

పాటలు పాడి, వారిని మారు పేర్లతో పిలుస్తూ

దక్షిణాఫ్రికాకు క్రికెట్‌ ఆడుతున్న సమయంలో మార్క్‌ బౌచర్‌ నల్లజాతీయ సహచరులను ఉద్దేశించి పాటలు పాడి, వారిని మారు పేర్లతో పిలిచి అవమానించాడు. దక్షిణాఫ్రికా జట్టులో ప్రతిసారి ఒకరిద్దరు నల్లజాతీయులు జట్టులో ఉండేవారు. బౌచర్‌ ఆడే సమయంలో ముఖాయ ఎంన్తినీ, పాల్‌ అడమ్స్‌ లాంటి ప్లేయర్స్ జట్టులో ఉన్నారు.

వారిని బౌచర్‌ మారు పేరుతో పిలుస్తూ.. పాటలు కూడా పాడాడు. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్‌ పాల్‌ అడమ్స్‌.. తాను జాతి వివక్షకు గురయ్యానంటూ ఆరోపణలు చేశాడు. దేంతో ఈ అంశానికి సంబంధించి బౌచర్‌ 14 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాన్ని దక్షిణాఫ్రికా సోషల్‌ జస్టిస్‌ అండ్‌ నేషన్‌ బిల్డింగ్‌ (ఎస్‌జేఎన్‌) కమిటీకి సమర్పించాడు.

క్షమించండి

క్షమించండి

'ఆ రోజుల్లో నేను నల్లజాతీయులపై ప్రవర్తించిన తీరుకు చాలా సిగ్గుపడుతున్నా. ఆ రోజు నేను ఆరోపణలు చేసినవారిలో పాల్‌ అడమ్స్‌ కూడా ఉన్నాడు. అడమ్స్‌ను మారు పేరుతో పిలుస్తూ పాటలు పాడాను. ఇది బాధాకరం. ఈ విషయంలో మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది.

ఏది ఏమైనా నా అమర్యాద ప్రవర్తనకు క్షమాపణలు చెబుతున్నా. ఆ కాలంలో జట్టు, సహాయ సిబ్బంది, సెలక్టర్లు, సీఎస్‌ఏ మరింత సున్నితంగా వ్యవహరించాల్సింది. జట్టు సభ్యులందరూ స్వేచ్చగా మాట్లాడే వాతావరణం కల్పించాల్సింది' అని మార్క్‌ బౌచర్‌ పేర్కొన్నాడు.

కెప్టెన్సీ పాపులారిటీ కాదు.. ఎప్పుడు ఎలా ఆడాలో కూడా తెలియదా? రూట్‌పై మండిపడ్డ ఇంగ్లండ్ మాజీ సారథి!!

బెయిల్‌ కంటికి తగలడంతో

బెయిల్‌ కంటికి తగలడంతో

మార్క్‌ బౌచర్‌ దక్షిణాఫ్రికా తరపున 147 టెస్టుల్లో 5515 పరుగులు, 295 వన్డేల్లో 4686 పరుగులు, 25 టీ20ల్లో 268 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే బౌచర్‌.. దక్షిణాఫ్రికా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. ఆస్ట్రేలియాపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో కూడా బౌచర్‌ తనవంతు పాత్ర పోషించాడు. ఇక వికెట్‌ కీపర్‌గా 532 క్యాచ్‌లు.. 555 స్టంపింగ్స్‌ చేశాడు. 2012లో సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్‌ బెయిల్‌ కంటికి తగలడంతో దురదృష్టవశాత్తూ ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం బౌచర్‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు హెడ్ కోచ్‌గా ఉన్నాడు.

ఎప్పటికీ ఒంటరిగానే ఉన్నా

ఎప్పటికీ ఒంటరిగానే ఉన్నా

గత సంవత్సరం దక్షిణాఫ్రికా బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ మఖయ ఎంన్తినీ మాట్లాడుతూ... 'నా క్రికెట్ జీవితంలో ఎప్పటికీ ఒంటరిగానే ఉన్నాను. రాత్రి భోజనం కోసం ఎవరూ నా తలుపు తట్టేవారు కాదు. సహచరులు నా ముందు ప్రణాళికలు రచించేవారు కానీ నాతో మాత్రం ఎప్పుడూ షేర్ చేసుకునేవారు కాదు.

భోజన సమయంలో నాతో కూర్చోవడానికి ఎవరూ ఇష్టపడేవారు కాదు. మేము ఒకే యూనిఫాం ధరించి ఒకే జాతీయ గీతాన్ని పాడతాం. కానీ నేను మాత్రం ఒంటరిగానే ఉన్నాను' అని ఎంన్తినీ అన్నాడు. మరికొందరు ప్రొటీస్ ప్లేయర్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Story first published: Tuesday, August 24, 2021, 14:22 [IST]
Other articles published on Aug 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+