IPL 2026: హద్దులు దాటుతున్నారు.. ఇక ఆ సెలెబ్రేషన్స్ ఆపండి: డేల్ స్టెయిన్
ఐపీఎల్ 2026 సీజన్‌లో పేపర్ నోట్ సెలెబ్రేషన్స్ నయా ట్రెండ్‌గా మారింది. వికెట్ తీసినప్పుడు.. హాఫ్ సెంచరీలు, సెంచరీలు సాధించినప్పుడు ఆటగాళ్లు తమ జేబుల్లో నుంచి పేపర్ ముక్కను తీసి కెమెరాలకు చూపిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆరంభంలో ఈ తరహా సెలెబ్రేషన్స్ ఆసక్తికరంగా అనిపించినా.. ప్రతీ ఒక్కరు అదే ఫాలో అవుతుండటంతో వీక్షకులకు బోరింగ్‌గా అనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఆకాష్ సింగ్.. వికెట్ తీసిన వెంటనే తన జేబులో నుంచి ఓ పేపర్ నోట్ తీసి కెమెరాలకు చూపిస్తూ సెలెబ్రేట్ చేసుకున్నాడు.
ఈ డ్రామాలే ఆపండి..
ఈ సెలెబ్రేషన్స్‌పై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ డ్రామాలను ఆపేయాలని యువ ఆటగాళ్లను మందలించాడు. ఈ మేరకు స్టెయిన్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. 'ఈ పేపర్ నోట్ సెలెబ్రేషన్స్‌ను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇదేం ఇప్పుడు ట్రెండింగ్‌లో లేదు. నిజం చెప్పాలంటే.. ఇది ఎప్పుడూ ట్రెండింగ్‌లో లేదు కూడా.'అని ట్వీట్ చేశాడు.

అభిషేక్ శర్మతో మొదలు..
ఈ వినూత్నమైన పేపర్ నోట్ సెలెబ్రేషన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెన్ అభిషేక్ శర్మ పరిచయం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌పై సెంచరీ చేసినప్పుడు.. 'ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం'అని రాసి ఉన్న పేపర్ నోట్ చూపించాడు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.
తాజా సీజన్‌లో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రఘు శర్మ తన తొలి ఐపీఎల్ వికెట్ తీసినప్పుడు 'జై శ్రీరామ్.. ముంబై ఇండియన్స్‌కు రుణపడి ఉంటా'అనే నోట్‌ను చూపించాడు. సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ లక్నో సూపర్ జెయింట్స్‌పై 13 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించినప్పుడు..'ఇది మీకోసం నాన్న'అనే పేపర్ నోట్ చూపించి సెలెబ్రేట్ చేసుకున్నాడు.
అక్కి అదరగొడుతున్నాడంట..
శుక్రవారం సీఎస్‌కేపై 3 వికెట్లు పడగొట్టిన లక్నో ప్లేయర్ ఆకాష్ సింగ్.. 'అక్కి అదరగొడుతున్నాడు.. టీ20ల్లో వికెట్లు ఎలా తీయాలో ఆకాష్‌కు తెలుసు'అని రాసి ఉన్న పేపర్‌ను చూపించాడు. ఈ సెలెబ్రేషన్స్ చాలా మందికి ఆగ్రహం తెప్పించింది.
టీవీ కెమెరాల దృష్టిని ఆకర్షించేందుకు కుర్రాళ్లు ఈ తరహాలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ తరహా సెలెబ్రేషన్స్‌పై డేల్ స్టెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలోని ప్రతిభ తప్ప, ప్రణాళికబద్దమైన సంబరాలకు తావు లేదని స్టెయిన్ తన ట్వీట్ ద్వారా స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications