For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: అందుకే అది నాటౌట్.. డీన్ ఎల్గర్ రివ్యూ పై వివరణ ఇచ్చిన సౌతాఫ్రికా బ్రాడ్‌కాస్టర్!

South Africa broadcaster Super Sport gives explanation on Dean Elgar’s controversial DRS call

కేప్‌టౌన్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ మూడో రోజు ఆటలో సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ రివ్యూపై దుమారం రేగిన విషయం తెలిసిందే. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ వేసిన 21వ ఓవర్‌లో డీన్ ఎల్గర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దాంతో భారత్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ మరైస్ ఎరాస్మస్ ఔటిచ్చాడు. అయితే బ్యాట్‌కు తాకిందనే సందేహంతో రివ్యూ తీసుకున్న ఎల్గర్.. బంతి ట్రాకింగ్‌ను గమనించి పెవిలియన్‌ వైపు అడుగులు వేశాడు.

అయితే, చివరికి బంతి వికెట్ల మీద నుంచి వెళ్లిందని, వికెట్లను మిస్సయ్యిందని బాల్ ట్రాకింగ్‌లో స్పష్టమవడంతో థర్డ్ అంపైర్ నాటౌటివ్వగా.. ఎల్గర్ తిరిగొచ్చి బ్యాటింగ్‌ చేశాడు. అయితే ఈ నిర్ణయం పట్ల భారత ఆటగాళ్లు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మొకాలి కింద మిడిల్ స్టంప్‌ను తాకుతున్నట్లు కనిపించిన బంతి అలా ఎలా బౌన్స్ అయి.. వికెట్లను మిస్సవుతుందనే సందేహం వ్యక్తం చేశారు.

కోహ్లీ, అశ్విన్ ఫైర్..

అసలు బంతి బౌన్స్ అవ్వడానికి రవిచంద్రన్ అశ్విన్ పేసర్ కూడా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సహనం కోల్పోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్పిన్నర్ అశ్విన్ స్టంప్ మైక్ దగ్గరకు వెళ్లి సౌతాఫ్రికా అధికారిక బ్రాడ్‌కాస్టర్ సూపర్ స్పోర్ట్‌పై మండిపడ్డారు. కాస్త ఘాటుగానే స్పందించిన విరాట్ కోహ్లీ.. స్టంప్ మైక్‌లో ''బంతికి మెరుగు పెడుతున్నపుడు.. కేవలం ప్రత్యర్థి పైనే కాదు మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు'' అని మండిపడ్డాడు.

ఇక అశ్విన్ మాత్రం గెలవడానికి మెరుగైన మార్గాలు ఎంచుకోవాలని సూపర్ స్పోర్ట్ చానెల్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ సైతం.. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.

అనూహ్య బౌన్స్‌తోనే..

అనూహ్య బౌన్స్‌తోనే..

ఈ విమర్శల నేపథ్యంలో ఈ సిరీస్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ అయిన సూపర్ స్పోర్ట్స్ ఈ వివాదాస్పద రివ్యూపై వివరణ ఇచ్చింది. పిచ్‌పై అనూహ్య బౌన్స్ ఉన్నందునే డీన్ ఎల్గర్ రివ్యూ సక్సెస్ అయిందని తెలిపాడు. ఈ నిర్ణయంలో బౌన్స్ కీలక పాత్ర పోషించిందని ఓ జిఫ్ ఫైల్‌ను ట్వీట్ చేసింది. దీనికి'పిచ్‌పై లభిస్తున్న అనూహ్య బౌన్స్.. డీన్ ఎల్గర్ సక్సెస్‌ఫుల్ రివ్యూలో కీలక పాత్ర పోషించింది'అని క్యాప్షన్‌గా పేర్కొంది. ఈ జిఫ్ ఫైల్‌లో అశ్విన్ తరవాతి ఓవర్ బంతులు ఏ విధంగా బౌన్స్ అవుతున్నాయో ట్రాకింగ్‌లో చూపించింది.

వసీం జాఫర్ సెటైర్స్..

వసీం జాఫర్ సెటైర్స్..

ఇక ఈ నిర్ణయంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఈ రివ్యూకు సంబంధించిన ఫొటోను షేర్ చేసిన వసీం.. టెక్నాలజీని కూడా పూర్తిగా నమ్మలేమని పేర్కొన్నాడు. సాధారణంగా టెక్నాలజీ 99 శాతం కరెక్ట్‌గా ఉంటుందంటారని, కానీ ఈ రోజు ఆ ఒక్క శాతాన్ని చూశామని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 'టెక్నాలజీ 99 శాతం ఖచ్చితమైనదని వారు ఎలా చెబుతున్నారో మీకు తెలుసు. ఈ రోజు మనం మిగిలిన ఒక్క శాతం చూశాము.'అని వసీం పేర్కొన్నాడు.

బౌలర్లపైనే ఆశలు..

బౌలర్లపైనే ఆశలు..

ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. బ్యాట్స్‌మెన్ అట్టర్ ఫ్లాఫ్‌ అవడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమైన కోహ్లీసేన ప్రత్యర్థి ముందు సునాయస లక్ష్యాన్ని నిర్దేశించింది. రిషబ్‌ పంత్‌ ( 139 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 నాటౌట్) శతకంతో చెలరేగినా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో భారత్ 198 పరుగులకే కుప్పకూలింది. దాంతో 13 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని సౌతాఫ్రికా ముందు 212 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 101 రన్స్ చేసి మెరుగైన స్థితిలో నిలిచింది.

Story first published: Friday, January 14, 2022, 14:38 [IST]
Other articles published on Jan 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+