రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం భారత పర్యటనకు రానున్న సౌతాఫ్రికా జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన వివరాలను సోమవారం వెల్లడించింది. పాకిస్థాన్ పర్యటనకు దూరంగా ఉన్న సౌతాఫ్రికా టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అతనే జట్టును నడిపించనున్నాడు. పాకిస్థాన్‌తో సిరీస్ ఆడిన మెజార్టీ ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
టెంబావుమాతో పాటు కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ, డీ జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హర్మర్, మార్కో యాన్సెన్, కేశవ మహరాజ్, ఎయిడెన్ మార్క్‌రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరినెలు చోటు దక్కించుకున్నారు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 ఎడిషన్‌లో భాగంగా జరిగే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు కీలకం. సొంతగడ్డపై జరిగే సిరీస్‌లు గెలిస్తేనే టీమిండియా ఫైనల్ అవకాశాలు మెరుగుపడుతాయి. తొలి రెండు ఎడిషన్స్‌లో ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకున్న భారత్.. మూడో ఎడిషన్‌లో తృటిలో ఫైనల్ బెర్త్‌ను కోల్పోయింది. ఈ ఎడిషన్‌లో సౌతాఫ్రికా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
వరల్డ్ ఛాంపియన్ అయిన సౌతాఫ్రికా.. పాకిస్థాన్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను డ్రా చేసుకుంది. భారత్‌లో గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. నవంబర్ 14 నుంచి కోల్‌కతా, 22 నుంచి గువాహతి వేదికగా టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం ఇంకా భారత జట్టును ప్రకటించలేదు. వెస్టిండీస్‌తో ఆడిన జట్టునే దాదాపు కొనసాగించే అవకాశం ఉంది.
టెంబావుమా, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ, డీ జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హర్మర్, మార్కో యాన్సెన్, కేశవ మహరాజ్, ఎయిడెన్ మార్క్‌రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరినె.