Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WI vs SA: వెస్టిండీస్ టూర్ కోసం దక్షిణాఫ్రికా జట్టు ఇదే.. డివిలియర్స్‌కు షాక్! రీఎంట్రీ లేనట్టేనా?

South Africa announce T20I squad for West Indies Tour, AB de Villiers retirement will remain final

జోహనెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌ రీఎంట్రీపై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. వెస్టిండీస్ పర్యటనలో డివిలియర్స్‌ రీఎంట్రీ ఖాయం అని అందరూ అనుకున్నా.. అలా జరగలేదు. వెస్టిండీస్ టూర్ కోసం క్రికెట్ దక్షిణాఫ్రికా మంగళవారం టెస్ట్, టీ20 జట్లను ప్రకటించింది. 19 మందితో కూడిన టీ20 జట్టులో డివిలియర్స్‌కు చోటు దక్కలేదు. దీంతో ఏబీ రీఎంట్రీ మళ్లీ మొదటికే వచ్చింది. డివిలియర్స్‌తో బోర్డు ఇంకా చర్చలు జరుపుతుందని, రిటైర్మెంట్‌పై ఫైనల్ డిసిషన్ త్వరలోనే తీసుకుంటుందని సమాచారం తెలుస్తోంది.

ఏబీతో చర్చలు

ఏబీతో చర్చలు

ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 2021లో ఏబీ డివిలియర్స్ అద్భుతంగా ఆడాడు. ఆడిన ఆరు ఇన్నింగ్స్‌ల్లో 164.28 స్ట్రైక్‌రేట్‌తో ఏబీ 207 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4, నెం.5 స్థానాల్లో వచ్చిన డివిలియర్స్ పరుగుల వరద పారించాడు. ఒక్కోసారి మ్యాచ్‌ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేశాడు.

కరోనా కారణంగా ఎక్కువగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకున్నా.. ఆ తేడాను అతడు ఎక్కడ కనబడనీయలేదు. దీంతో ఈ ఏడాది అక్టోబరు-నవంబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఏబీ ఆడతాడని అందరూ ఊహించారు. కానీ అంచనాలు తలక్రిందులు అయ్యాయి. వెస్టిండీస్ టూర్ కోసం ఎంపిక చేయలేదు. అయితే ఏబీతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.

మనసు మార్చుకున్న ఏబీ

ఐపీఎల్ 2018 సీజన్ ముగిసిన స్వదేశానికి వెళ్లిన ఏబీ డివిలియర్స్.. ఎవరూ ఊహించని రీతిలో ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. రోజుల వ్యవధిలోనే తన మనసు మార్చుకున్న ఏబీ.. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని ఆశించాడు. కానీ టీమ్‌ భవిష్యత్‌ని పట్టించుకోకుండా స్వార్థంగా అతను రిటైర్మెంట్ ఇచ్చేశాడని అప్పట్లో విమర్శించి.. అతని పునరాగమనాన్ని వ్యతిరేకించారు.

దాంతో ఏబీ కూడా మౌనంగా ఉండిపోయాడు. ఇక ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పేలవ పరాజయాలతో కనీసం సెమీస్‌కి కూడా చేరలేకపోయింది. దీంతో ఏబీని తీసుకురావాలని కొందరు పావులు కదుపుతున్నారు.

డుప్లెసిస్‌కు నిరాశే

డుప్లెసిస్‌కు నిరాశే

దక్షిణాఫ్రికా టీ20 జట్టుకి తెంబా బావుమా కెప్టెన్ కాగా.. టెస్ట్ జట్టుకు డీన్ ఎల్గర్ సారథిగా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌కు రెండు ఫార్మాట్లలో మొండిచేయి ఎదురైంది. ఐపీఎల్ 2021లో పరుగుల వరద పారించిన అతడికి చోటు దక్కకపోవడం విశేషం. ప్రెనెలన్ సుబ్రేయెన్ టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వగా.. లిజాద్ విలియమ్స్ టెస్ట్ ఆరంగేట్రం చేశాడు. ఐపీఎల్ స్టార్లు డికాక్, ఎంగిడి, నోర్జ్, రబడా రెండు జట్లకు ఎంపికయ్యారు. దక్షిణాఫ్రికా జట్టు త్వరలోనే వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, ఐదు టీ20 సిరీస్‌లను ఆడబోతోంది.

WTC Final: టీమిండియాకు గుడ్ న్యూస్.. త్వరలోనే జట్టుతో కలవనున్న వికెట్‌ కీపర్‌!!

దక్షిణాఫ్రికా టీ20 జట్టు

దక్షిణాఫ్రికా టీ20 జట్టు

బావుమా, డికాక్, ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, క్లాసేన్, లిండే, మగాలా, జన్నెమాన్ మలన్, మార్క్రామ్, మిల్లర్, ఎంగిడి, నోర్జ్, రబాడా, షంసీ, డుసెన్, వెర్రిన్నే, లిజాడ్ విలియమ్స్, ప్రిటోరియస్, ఫెహ్లుక్వాయో.

టెస్ట్ టీమ్:

ఎల్గర్, బావుమా, డికాక్, ఎర్వీ, హెన్డ్రిక్స్, లిండే, మహారాజ్, మార్క్రామ్, ముల్డర్, ఎంగిడి, నోర్జ్, పీటర్సన్, జాన్సెన్, రబడా, షబాయ్, వాన్ డెర్ డుసెన్, వెర్రిన్నే, విలియమ్స్.

Story first published: Tuesday, May 18, 2021, 17:53 [IST]
Other articles published on May 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+