Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: టీమిండియాకు గుడ్ న్యూస్.. త్వరలోనే జట్టుతో కలవనున్న వికెట్‌ కీపర్‌!!

WTC Final: Wriddhiman Saha recovers from Coronavirus, all set to join India squad

ముంబై: టీమిండియాకు గూడ్‌ న్యూస్‌. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్న సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దాదాపుగా 17 రోజుల తర్వాత అతడికి నెగెటివ్‌ వచ్చింది. దీంతో వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు సాహా అందుబాటులో ఉండనున్నాడు. త్వరలోనే కోహ్లీసేనతో కలవనున్నాడు. సూమారు మూడు వారాల పాటు ఢిల్లీలోని ఓ హాటల్‌లో క్వారంటైన్ వున్న సాహా సోమవారం ఇంటికి చేరుకున్నట్లు అతని సన్నిహితులు తెలిపారు.

ఐపీఎల్ 2021 నిరవధికంగా వాయిదా వేయడానికి ముందు టీమిండియా టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో మే 4న ముంబై ఇండియన్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌ వాయిదా పడింది. అయితే సాహాకు లక్షణాలు ఉండటంతో ఢిల్లీలోనే ఐసోలేషన్లో ఉన్నాడు. టోర్నీ వాయిదా పడ్డాక కోల్‌కతాకు వచ్చి క్వారంటైన్‌లో గడిపాడు. ఇదే సమయంలో బీసీసీఐ సెలక్టర్లు ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును ప్రకటించారు. సాహా ఫిట్‌నెస్‌ నిరూపించుకొంటే ఇంగ్లండ్‌కు వెళ్తాడని స్పష్టం చేశారు.

వృద్ధిమాన్ సాహాకు రెండు రోజుల క్రితం నిర్వహించిన రెండు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షల్లో ఒకటి పాజిటివ్‌, ఒకటి నెగెటివ్‌ వచ్చింది. దీంతో అతడు జట్టులో చేరడంపై సందిగ్ధం నెలకొంది. పాజిటివ్‌ వచ్చినా.. క్వారంటైన్‌ బ్రేక్‌ చేశాడంటూ కొన్ని వదంతులు వచ్చాయి. వాటిని సాహా ఖండించాడు. ఇంకా క్వారంటైన్లోనే ఉన్నానని స్పష్టం చేశాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో అతడు క్వారంటైన్‌ బ్రేక్‌ చేశాడు. కుటుంబ సభ్యులను కలిశాక ముంబైకి బయల్దేరనున్నాడు.

వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి కోలుకున్నాడు. అతడి శరీరంలో పూర్తి స్థాయిలో యాంటీబాడీస్‌ ఉండటంలో మళ్లీ వైరస్‌ సోకే అవకాశాలు అత్యంత తక్కువ' అని బీసీసీఐ బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి. ఇంగ్లండ్‌కు బయలు దేరేముందు ముంబైలో టీమిండియా కఠిన ఆంక్షల మధ్య బయో బబుల్‌లో ఉండనుంది. ఈ బయో బబుల్‌లో చేరడానికి ముందు సాహా మరోసారి RT-PCR పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. సౌతాంప్టన్‌లో జూన్ 18 నుంచి జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.

Story first published: Tuesday, May 18, 2021, 16:08 [IST]
Other articles published on May 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+