
కశ్మీర్ లీగ్‌లో ఆడాడని..
లెజెండ్స్ లీగ్ రెండో ఎడిషన్ ప్రారంభానికి ముందే ఈ మ్యాచ్ జరగనుంది. భారత లెజెండ్స్ జట్టును సౌరవ్ గంగూలీ నడిపించనున్నాడు. భారత్ లెజెండ్స్ టీమ్‌కు గంగూలీతో పాటు పలువురు భారత దిగ్గజ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. వరల్డ్ లెజెండ్స్ జట్టు తరఫున వివిధ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు పాల్గొంటున్నారు. కాగా, వరల్డ్ లెజెండ్స్ టీమ్‌కు హర్షల్ గిబ్స్‌ను ఎంపిక చేయడం వివాదాస్పదంగా మారింది. గిబ్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించిన కశ్మీర్ టీ20 లీగ్‌లో పాల్గొనడమే ఇందుకు కారణం.

విమర్శలు రావడంతో..
గిబ్స్ ఎంపికపై భారత క్రికెట్ అభిమానలు సోషల్‌మీడియా వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటూ పాక్ లీగ్‌లో పాల్గొన్న ఆటగాడిని భారత్‌లో ఎలా ఆడనిస్తారని మండిపడ్డారు. ఈ విషయంలో నెటిజన్లు బీసీసీఐ బాస్ గంగూలీని టార్గెట్ చేశారు. దీంతో అప్రమత్తమైన దాదా.. గిబ్స్‌ను లెజెండ్స్ లీగ్ నుంచి తప్పించి, షేన్ వాట్సన్‌ను అతని స్థానంలో భర్తీ చేశాడు. గంగూలీ నిర్ణయంతో సంతృప్తి చెందిన అభిమానులు విమర్శించిన నోళ్లతోనే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వేటు వేసిన బీసీసీఐ..
కాగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కశ్మీర్ లీగ్‌లో పాల్గొనకూడదని బీసీసీఐ గతంలో ప్రపంచ దేశాల క్రికెటర్లను ఆదేశించింది. అయితే గిబ్స్ బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేసి కశ్మీర్ లీగ్‌లో పాల్గొన్నాడు. బీసీసీఐ, తనను క్రికెట్ ఆడకుండా భయపెడుతోందని... క్రికెట్‌నీ, రాజకీయాలను ముడిపెట్టకండని వాదించాడు. దానికి ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. అలాగే జయసూర్య స్థానంలో డానియల్ విటోరీకి వరల్డ్ జెయింట్స్‌లో చోటు దక్కింది.


Click it and Unblock the Notifications












