Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: అప్పుడు సెహ్వాగ్, యువరాజ్, ధోనీ.. ఇప్పుడు పంత్: గంగూలీ

Sourav Ganguly says Rishabh Pant is match winner for Team India
#RishabhPant A Match-Winner Like MS Dhoni And Sehwag - Sourav Ganguly || Oneindia Telugu

కోల్‌కతా: భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించారు. తన కాలంలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలు గేమ్ ఛేంజర్‌లు అని.. ఇప్పుడు పంత్ అని దాదా పేర్కొన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ (97: 118 బంతుల్లో 12x4, 3x6), గబ్బా ‌(89; 138 బంతుల్లో 9x4, 1x6) టెస్టుల్లో రెచ్చిపోయిన పంత్.. టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇంగ్లండ్‌తోనూ జరిగిన చివరి టెస్టులో శతకం (101; 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది.. మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు.

గేమ్ ఛేంజర్

గేమ్ ఛేంజర్

తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇండియా టుడేతో మాట్లాడుతూ... 'నేను రిషబ్ పంత్‌ని చాలా దగ్గర నుంచి చూశాను. మ్యాచ్ విజేతలను నేను నమ్ముతాను. తమదైన రోజున వారు ఒంటిచేత్తో మ్యాచును గెలిపిస్తారు. పంత్ అచ్చం అలాంటి ఆటగాడే. నేను గతంలో కూడా ఇదే చెప్పాను.. ఇప్పుడు మరోసారి చెపుతున్నాను. సిడ్నీ టెస్టులో పంత్ మరో 5 లేదా 6 ఓవర్లు క్రీజులో ఉండిఉంటే.. భారత్ మ్యాచ్ గెలిచేది. అతడు గేమ్ ఛేంజర్. నా కాలంలో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలు మ్యాచ్ విజేతలు' అని అన్నారు.

అద్భుత ఆటతో మలుపు తిప్పాడు

అద్భుత ఆటతో మలుపు తిప్పాడు

'రిషబ్ పంత్.. ఇంగ్లండ్‌తో ఆడిన విధానాన్ని చూడండి. నాలుగవ టెస్టులో భారత్ 6 వికెట్లకు 146 పరుగులు మాత్రమే చేసింది. మ్యాచ్ దాదాపు మన చేతుల్లోని పోయింది. కానీ పంత్ తన అద్భుత ఆటతో మలుపు తిప్పాడు. రెండవ కొత్త బంతితో ఇబ్బంది పెడుదామానుకున్న జేమ్స్ అండర్సన్ ఆటలు సాగలేదు. అండర్సన్‌పై పంత్ ఎదురుదాడికి దిగిన విధానం అద్భుతంగా ఉంది' అని సౌరవ్ గంగూలీ ప్రశంసించారు. 2020 పంత్‌కు కలిసిరాలేదు. ఐపీఎల్ 2020లో కూడా మోస్తరుగానే రాణించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మొదటి టెస్టు ఆడలేదు. సాహా విఫలమవడంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.

పంత్‌కు అవకాశాలు ఇవ్వాలి

పంత్‌కు అవకాశాలు ఇవ్వాలి

ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో పంత్‌కు అవకాశాలు ఇవ్వాలని మాజీ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సూచించారు. టీ20ల్లో అతడికి సరైన అవకాశాలిస్తే బాగా ఆడతాడని చెప్పారు. 'పంత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఒత్తిడి సమయాల్లో బ్యాటింగ్‌ చేసి ఆ జట్టుకు విజయాలు అందించడం చూశాం. ఎడమచేతివాటం గల బ్యాట్స్‌మన్‌గా ప్రత్యర్థి కెప్టెన్లకు చెమటలు పట్టిస్తాడు. టీ20 ప్రపంచకప్‌ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే పంత్‌ చేరిక జట్టుకు లాభదాయకం. ఒకటి, రెండూ ఇన్నింగ్స్‌ చూసి అతడిని అంచనా వేయొద్దు. దీర్ఘకాలంలో ఆలోచించి అవకాశాలివ్వాలి. అతడికి తుది జట్టులో చోటు ఉంటుందనే భరోసా కల్పిస్తే ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తాడు' అని అన్నారు.

సాహా విఫలమవడంతో

సాహా విఫలమవడంతో

రిషబ్ పంత్‌ బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ మెరిశాడు. నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో సెంచరీ చేసి తన విలువేమిటో మరోసారి చాటి చెప్పాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 270 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

మెడిక‌ల్ సిబ్బందిని ఆట‌ప‌ట్టించిన స‌చిన్‌.. 'మాస్టర్' కరోనా టెస్ట్ చూస్తే నవ్వులే (వీడియో)

Story first published: Tuesday, March 9, 2021, 17:09 [IST]
Other articles published on Mar 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+