Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసియాకప్‌లో ఏ జట్టు తోపు కాదు: సౌరవ్ గంగూలీ

న్యూఢిల్లీ: ఆసియాకప్ 2023 టోర్నీలో పాల్గొనే జట్లలో ఏ టీమ్ కూడా ఫేవరేట్ కాదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భారత్‌, పాకిస్థాన్‌ పోరులో ఎవరూ అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తే వారికే విజయం దక్కుతుందని స్పష్టం చేశాడు. ఆగస్టు 30న ఆసియాకప్ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 2 భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.

ఈ మ్యాచ్‌కు ఇంకా ఏడు రోజుల సమయం ఉన్నా.. హాట్ టాపిక్‌ మారింది. యావత్ క్రికెట్ ప్రపంచం ఈ హైఓల్టేజ్ సమరం కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌పై స్పందించిన గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్‌ను ఎవరు నెగ్గుతారనే అంశంపై కూడా మాట్లాడాడు.

 Sourav Ganguly

'ఆసియా కప్‌ 2023లో ఫేవరేట్‌ ఎవరని చెప్పడం కష్టంగానే ఉంది. టోర్నీలో పాల్గొనే ప్రతీ జట్టుకు గెలిచే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్‌ జట్లు అద్భుతంగా ఉన్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులోకి రావడం టీమిండియాకు అదనపు బలం. ఇప్పటికే బుమ్రా టీ20ల్లో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు.

అయితే, ఆసియా కప్‌ వన్డే ఫార్మాట్‌ కావడంతో ఎలా బౌలింగ్‌ చేస్తాడనేది వేచి చూడాలి. సెలెక్షన్ కమిటీ ఉత్తమ జట్టునే ఎంపిక చేసిందని భావిస్తున్నా. ఉపఖండ పిచ్‌లపై ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం మంచిదే. అందుకోసం బ్యాటింగ్‌ కూడా చేయగలిగే అక్షర్ పటేల్ ఎంపిక సరైందే. ఆసియా కప్‌ అయినా, ప్రపంచకప్ అయినా బ్యాటింగ్‌ ఆర్డర్‌ రాణిస్తే విజయం సాధించడం సులువు.

రెండు విభిన్న టోర్నీలు అయినా ఆడే విధానం మెరుగుపర్చుకుంటూ వెళ్లాలి'' అని గంగూలీ చెప్పుకొచ్చాడు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తుది జట్టు ఎంపిక టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సవాల్‌గా మారింది. తుది జట్టులో ఎవర్నీ ఆడించాలి? ఎవర్నీ పక్కనపెట్టాలి? అనేది తేల్చుకోలేకపోతుంది.

ఐసీసీ ప్రపంచకప్ బరిలోకి దిగే భారత జట్టును సౌరవ్ గంగూలీ అంచానా వేసాడు. ఆసియాకప్‌కు ఎంపిక చేసిన జట్టులో తిలక్ వర్మ, ప్రసిధ్ కృష్ణలను గంగూలీ బ్యాకప్‌గా ఎంపిక చేశాడు.

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్యాంప్‌లో ఫిట్‌నెస్ డ్రిల్స్‌తో పాటు ప్లేయర్లకు యోయో ఫిట్‌నెస్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తున్నారు.

Story first published: Saturday, August 26, 2023, 12:44 [IST]
Other articles published on Aug 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+