For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ సక్సెస్ కనబడలేదా? బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఏం చేయలేదని ఎలా అంటారు?.. గంగూలీ ఫైర్!

Sourav Ganguly says Many good things happened in my tenure over N Srinivasan’s non-performance accusation

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా తాను ఏం చేయలేదంటూ వచ్చిన ఆరోపణలపై సౌరవ్ గంగూలీ స్పందించాడు. మీడియా రైట్స్ ద్వారా కోట్ల ఆదాయం, కరోనా సమయంలో ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించడం వంటివి కనబడటం లేదా? అని ప్రశ్నించాడు. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి కొనసాగాలనుకున్న దాదాకు బోర్డు సభ్యులు షాకిచ్చారు. సౌరవ్ గంగూలీ బీసీసీఐలో కొనసాగేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు. ఇటీవల ముంబై వేదికగా జరిగిన సమావేశంలో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా గంగూలీ ఏం చేయలేదని, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ ఆరోపించినట్టు వార్తలు వచ్చాయి.

శ్రీనివాసన్ పట్టు బట్టి..

శ్రీనివాసన్ పట్టు బట్టి..

అసలు గంగూలీ రెండోసారి అధ్యక్ష ఆశలకు గండి కొట్టింది సెక్రటరీ జై షా అని వినిపిస్తున్నా.. దాదా అభ్యర్థిత్వాన్ని గట్టిగా వ్యతిరేకించింది మాత్రం శ్రీనివాసన్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది. బోర్డు సభ్యులందరిని ఏకతాటిపైకి తెచ్చి దాదా బీసీసీఐని విడిచిపెట్టేలా చక్రం తిప్పినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై దాదా తాజాగా స్పందించాడు. కోల్‌కతా వేదికగా బంధన్ బ్యాంక్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ..శ్రీనివాసన్ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చాడు. 'నేను క్రికెటర్లకు ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేటర్‌ను. నా హయాంలో మంచి విషయాలెన్నో జరిగాయి. కోవిడ్ సందర్భంలో బయటకు రావడానికే అందరూ భయపడుతుంటే ఐపీఎల్ వంటి మెగా టోర్నీని విజయవంతంగా నిర్వర్తించాను.

కోట్ల రూపాయల ఆదాయం..

కోట్ల రూపాయల ఆదాయం..

నా హయాంలోనే భారత అండర్-19 జట్టు వన్డే ప్రపంచకప్ నెగ్గింది. ఐపీఎల్ మీడియా హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు రజత పతకం సాధించింది. భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియా లో టెస్టు సిరీస్ గెలిచింది. ఇవన్నీ నా హయాంలో జరిగినవే కదా.. ఇవన్నీ నా పనితీరుకు నిదర్శనం కాదా.?'అని గంగూలీ ప్రశ్నించాడు.

శ్రీనివాసన్‌కు దాదా పడనిది అందుకే

శ్రీనివాసన్‌కు దాదా పడనిది అందుకే

గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేసిన శ్రీనివాసన్.. వాస్తవానికి 2019లో తన మిత్రుడు బ్రిజేష్ పటేల్‌ను బీసీసీఐ అధ్యక్షుడిగా చేయాలని భావించాడు. కానీ చివరి నిమిషంలో గంగూలీ చక్రం తిప్పి అధ్యక్ష పీఠం మీద కూర్చున్నాడు. దీంతో అప్పట్నుంచి శ్రీనివాసన్.. దాదా మీద పగ తీర్చుకోవడానికి చూస్తున్నాడని బీసీసీఐ వర్గాలలో వినిపిస్తున్న టాక్. అందుకే అదును చూసి గంగూలీని దెబ్బకొట్టాడని అతని అభిమానులు ఆరోపిస్తున్నారు.

దాదా ఘనతలు..

దాదా ఘనతలు..

దాదా హయాంలో భారత క్రికెట్‌లో చాలా మంచి విషయాలు జరగాయనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్‌తో పింక్ బాల్ టెస్ట్ ఆడించి టెస్ట్ ఫార్మాట్‌కు ఆదరణ పెంచడం, కరోనా సమయంలో మూడు ఐపీఎల్ సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వర్తించడం, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లను కోచ్‌లుగా తీసుకురావడం, ఒకే సమయంలో రెండు జట్లతో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడించడం, మహిళల ఐపీఎల్‌కు సంబంధించిన బ్లూ ప్రింట్ ను సిద్ధం చేయడం వంటివన్నీ గంగూలీ పనితనానికి నిదర్శనాలే.

Story first published: Friday, October 14, 2022, 15:01 [IST]
Other articles published on Oct 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+