
ఫిబ్రవరిలో ఇంగ్లండ్ టూర్:
ప్రస్తుత షెడ్యూల్ యథాతథంగా కొనసాగుతుందని, ఎఫ్‌టీపీ కమిట్‌మెంట్లను బీసీసీఐ గౌరవించనుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పారు. 'ఈ ఏడాది డిసెంబర్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. అక్కడే జనవరి వరకు ఉండనుంది. టీమిండియా తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడనుంది. దీని తర్వాత ఏప్రిల్‌లో ఐపీఎల్ 2021 ఉంటుంది' అని గంగూలీ లేఖలో పేర్కొన్నారు.

దేశవాళీ క్రికెట్‌ను ప్రారంభించాలనుకుంటున్నాం:
'భవిష్యత్ ప్రణాళికల గురించి అన్ని రాష్ట్ర సంఘాలకు తెలియజేయబడుతుంది. స్వదేశంలో క్రికెట్ పునరుద్ధరణకు అందరి సూచనలు తీసుకోబడతాయి. దేశవాళీ క్రికెట్ తిరిగి ప్రారంభించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దేశీయ క్రికెట్‌లో పాల్గొనే ఆటగాళ్లు, ఇతరుల ఆరోగ్యం, భద్రతకు బీసీసీఐ అధిక ప్రాధాన్యతనిస్తుంది. అన్ని అంశాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నాం. మరికొన్ని నెలల్లో కరోనా పరిస్థితులు త్వరలోనే మెరుగుపడతాయని ఆశిస్తున్నాం. సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో దేశవాళీ క్రికెట్‌ను ప్రారంభించాలనుకుంటున్నాం' అని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పారు.

ధర్మాసనం ఆదేశిస్తే:
బీసీసీఐ నూతన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా పదవీ కాలం ఇప్పటికే పూర్తయింది. దీంతో లోధా కమిటీ సూచించిన మూడేళ్ల కూలింగ్ ఆఫ్ పీరియడ్‌పై సవరణ కోరుతూ బోర్డు.. కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం నుంచి తీర్పు వచ్చే దాకా గంగూలీ, జైషా బోర్డు పదవుల్లో కొనసాగనున్నారు. బీసీసీఐ అప్పీలును స్వీకరించిన సుప్రీం కోర్టు జస్టిస్ అరవింద్ బోబ్డే, ఎల్ నాగేశ్వరరావుతో కూడిన బెంచ్‌కు అప్పగించింది. దీనిపై ఇప్పటికే విచారణ జరగాల్సి ఉండగా.. ధర్మాసనం తన లిస్ట్‌లో ఈ కేసును చేర్చలేదు. దీంతో విచారణకు మరికొంత కాలం ఆగాల్సి ఉంది. బీసీసీఐ పదవి నుంచి తప్పుకోమని ధర్మాసనం ఆదేశిస్తే.. తనతో పాటు సెక్రటరీ జైషా కూడా బోర్డుకు దూరంగా ఉంటాడని దాదా ఇప్పటికే స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications

IPL 2020: ఏబీడీ రాక.. జట్టులో సందడి వాతావరణం (వీడియో)










