For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sourav Ganguly: విరాట్ కోహ్లీని కెప్టెన్సీ నుంచి నేను తప్పించలేదు!

టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని తాను తొలగించలేదని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) మరోసారి స్పష్టం చేశాడు. కోహ్లీనే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడని వెల్లడించాడు. టీ20 కెప్టెన్సీ వదులుకుంటానంటే.. వన్డే కెప్టెన్సీ కూడా వదిలేయాలని మాత్రమే తాను సూచించానని చెప్పాడు.

ఇది కూడా కోహ్లీ మంచిని కోరే చెప్పానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2021 ఘోర పరాజయం అనంతరం విరాట్ కోహ్లీ టీ20 సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. వన్డే ఫార్మాట్‌తో పాటు టెస్ట్ క్రికెట్‌లో సారథిగా కొనసాగాలనుకున్నాడు. కానీ టీ20 సారథ్యం వదులుకున్న కోహ్లీని.. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పించారు.

Sourav Ganguly says I didn’t remove Virat Kohli from captaincy

వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పట్లో ఈ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని విరాట్ కోహ్లీ మీడియా ముందు అసంతృప్తి వ్యక్తం చేశాడు.

విరాట్ కోహ్లీకి చెప్పే ఈ నిర్ణయం తీసుకున్నామని గంగూలీ వివరణ ఇవ్వగా.. అతని వ్యాఖ్యలను కూడా కోహ్లీ ఖండించాడు. కెప్టెన్సీ గురించి తనతో ఎవరూ మాట్లాడలేదని, నిర్ణయాన్ని ప్రకటించే ముందు ఫోన్‌లో సమాచారమిచ్చారని తెలిపాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని అవమానంగా భావించిన కోహ్లీ.. టెస్ట్ కెప్టెన్సీని కూడా వదిలేసాడు.

అప్పటి నుంచి కోహ్లీ-గంగూలీ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా కూడా ఈ ఇద్దరూ కనీసం ఒకరినొకరు పలకరించుకోలేదు. ఒకరి వైపు మరొకరు ఆగ్రహంగా చూసుకున్నారు. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించిన విధానాన్ని తప్పుబట్టిన బీసీసీఐ ఆఫీస్ బేరర్లు.. అతను మరోసారి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగకుండా అడ్డుకున్నారు.

ఐసీసీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలున్నా.. మద్దతు ఇవ్వలేదు. దాంతో గంగూలీ.. బీసీసీఐని వీడాల్సి వచ్చింది. ప్రస్తుతం అతను ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా దాదాగిరి అన్‌లిమిటేడ్ సీజన్ 10 అనే రియాల్టీ షో‌లో పాల్గొన్న గంగూలీని విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఎపిసోడ్‌పై ప్రశ్నించగా.. తన తప్పేం లేదని వివరణ ఇచ్చాడు.

'విరాట్ కోహ్లీని కెప్టెన్సీ బాధ్యత‌ల నుంచి నేను తప్పించలేదు. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. టీ20‌ల్లో కెప్టెన్‌గా కొనసాగేందుకు అతను అనాసక్తిని ప్రదర్శించాడు. టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

టీ20ల్లో కెప్టెన్‌గా కొనసాగలేనప్పుడు.. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాలని నేను సూచించాను. కేవలం టెస్ట్‌ల్లో మాత్రమే సారథ్యం చేయమని చెప్పాను. అతని మంచి కోరే ఈ సలహా ఇచ్చాను.'అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, December 5, 2023, 16:36 [IST]
Other articles published on Dec 5, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+