Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా టీమిండియాకు కీలకం అవుతారు: దాదా

Sourav Ganguly Says Hardik Pandya, Ravindra Jadeja Can Be Huge Assets In The Long Run

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా ఆల్‌రౌండర్లు సౌరవ్ గంగూలీ, రవీంద్ర జడేజాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ ఇద్దరూ భారత జట్టుకు కీలక ఆటగాళ్లుగా అవతరిస్తారన్నాడు. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీసేన 13 పరుగులతో గెలుపొందిన సంగతి తెలిసిందే. దాంతో ఎన్నో అంచనాల మధ్య ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టుకు ఇదే తొలి విజయం. అయితే ఈ గెలపుతో పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నానని గంగూలీ ట్వీట్ చేశాడు.

విలువైన ఆటగాళ్లు..

విలువైన ఆటగాళ్లు..

‘సిరీస్‌ ఓడిపోయినా టీమిండియాకు మంచి విజయం దక్కింది. ఇది సుదీర్ఘ పర్యటన అయినందున ఈ విజయంతోనైనా పరిస్థితులు మారుతాయని ఆశిస్తున్నా. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా దీర్ఘ కాలంలో భారత జట్టుకు విలువైన ఆటగాళ్లుగా మారతారు' అని దాదా మ్యాచ్‌ అనంతరం ట్వీటర్ వేదికగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా తొలి రెండు వన్డేల్లో విజయం సాధించడంతో ఆ జట్టు 2-1 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. భారత్‌ మూడో వన్డేలో గట్టి పోటీనివ్వడంతో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కోహ్లీసేన టీ20 సిరీస్‌ గెలవడమే కాకుండా టెస్టు సిరీస్‌లోనూ మంచి ఫలితాలు సాధించాలని గంగూలీ ఆశిస్తున్నాడు.

150 పరుగుల భాగస్వామ్యంతో..

150 పరుగుల భాగస్వామ్యంతో..

బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో 152 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టును హార్దిక్ పాండ్యా(76 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రవీంద్ర జడేజా (50 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. విధ్వసంకర బ్యాటింగ్‌తో ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులు జోడించి జట్టు స్కోర్‌ను 300 ధాటించారు. వీరి విరోచిత ఇన్నింగ్స్‌కు భారత్ చివరి 10 ఓవర్లలో 110 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఆల్‌రౌండర్స్ జోడీని కొనియాడాడు. ఆసీస్‌పై గెలవాలంటే ఈ ఇద్దరిలానే ఆడాలన్నాడు.

9న తేలనున్న దాదా భవితవ్యం..

9న తేలనున్న దాదా భవితవ్యం..

బీసీసీఐ‌లో తమ పదవీకాలం పొడిగించుకోవాలని ఆశిస్తున్న ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా భవితవ్యం వచ్చే వారం తేలనుంది. లోధా కమిటీ సిఫార్సు చేసిన 'కూలింగ్ ఆఫ్'క్లాజ్‌లో మార్పులకు అనుమతించాలని బోర్డు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ నెల 9వ తేదీన తుది విచారణ చేపట్టనుంది. ఈ మేరకు జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు నేతృత్వంలోని బెంచ్ ఈ విషయాన్ని తమ జాబితాలో చేర్చింది. దాదా, జైషా బీసీసీఐ, స్టేట్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లుగా తమ ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. మేలో షా, జూన్‌లో గంగూలీ టర్మ్ ముగిసినప్పటికీ ఇంకా తమ పదవుల్లో కొనసాగుతున్నారు. బోర్డు ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం వాళ్లిద్దరూ మూడేళ్ల విరామం(కూలింగ్ ఆఫ్) తీసుకోవాల్సి ఉంది.

Story first published: Thursday, December 3, 2020, 14:47 [IST]
Other articles published on Dec 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+