
ఇదే తొలిసారి కాదు..
తాజాగా దుబాయ్ వేదికగా ఇండియా టుడే చానెల్ ఏర్పాటు చేసిన సలామ్ క్రికెట్ సదస్సులో పాల్గొన్న సౌరవ్ గంగూలీ.. భారత్-పాక్ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'పాకిస్థాన్‌తో ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించడం ఇదే తొలిసారి కాదు. 2015 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తోనే మొదలుపెట్టాం. 2019లో కాదనుకుంటా.. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ ఆరంభ మ్యాచ్‌తో పాటు ఫైనల్లో తలపడ్డాం. ఇది ఇలానే కొనసాగుతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లపై అందరికి ఆసక్తి ఉంటుంది. అయితే ఈ మ్యాచ్‌లను నిర్వహించడం పెద్ద కష్టమేం కాదు. నేను ఆటగాడిగా ఉన్నప్పుడు కూడా పాక్‌తో మ్యాచ్ అంటే ఒత్తిడికి గురవ్వలేదు.

అబ్బో భారత్‌లో మ్యాచా..?
కానీ చాలా మంది భారత్-పాక్ మ్యాచ్ అంటే భిన్నమైన ఒత్తిడి ఉంటుందని తరుచూ చెబుతూ ఉంటారు. కానీ నేనెప్పుడూ అలా ఫీలవ్వలేదు. అయితే 2016 ప్రపంచకప్ మ్యాచ్ నిర్వహణ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు పడ్డా. అప్పుడు నేను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఉన్నా. ఈడెన్ గార్డెన్ వేదికగా దాయాదీ దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. అప్పుడే అనిపించింది భారత్‌లో పాక్‌తో మ్యాచ్ నిర్వహించడం కష్టమని. ఎందుకంటే ఆ టికెట్ల డిమాండ్‌ను మనం తట్టుకోలేం. లక్షల సీటింగ్ కెపాసిటీ కలిగిన మైదానాలను నిర్మించినా ఆ డిమాండ్‌ను తగ్గించలేం. ప్రతీ ఒక్కరు టికెట్స్ అడుగుతారు. నిజంగా ఆ బాధ వర్ణాతీతం. అయితే మెగా టోర్నీ యూఏఈకి తరలిరావడంతో ఈ సారి ఆ బాధ తప్పింది.

భారత్‌లో ఉన్న ఆదరణ..
ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌పై భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు భారత జట్టు ఓటమెరుగలేదు. సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. ఒకప్పుడు పాకిస్థాన్ బలమైన జట్టు. కానీ నెమ్మదిగా భారత్ ఆ జట్టును ఓడించడం ప్రారంభించింది. భారత క్రికెట్ సెటప్, స్ట్రక్చర్ బాగుంది. అందుకే మేటీ ఆటగాళ్లు తయారు చేయగలుగుతున్నాం. మనదేశంలో క్రికెట్ పట్ల ఉన్న పిచ్చి వల్ల చాలా మంది కుర్రాళ్లు క్రికెటర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ఇది భారత క్రికెట్‌కు శుభసూచకం'అని దాదా చెప్పుకొచ్చాడు.

టైటిల్ ఫేవరెట్ భారత్
బరిలోకి దిగేది 12 జట్లయినా టైటిల్ ఫేవరెట్లలో మాత్రం కొన్ని జట్లే ఉన్నాయి. 2007లో తొలిసారిగా జరిగిన టీ20 ప్రపంచక్‌పను మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా గెలుచుకుంది. ఇప్పటిదాకా మరో టోర్నీ దక్కకపోయినా ఈసారి మాత్రం జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుండడం సానుకూలాంశం. దీనికి తోడు ధోనీ మెంటార్‌గా టీమ్‌ను వెనకుండి నడిపించబోతున్నాడు. ఇటీవలె ముగిసిన ఐపీఎల్‌తో ఆటగాళ్లంతా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే ఉన్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్.. రోహిత్, విరాట్, రాహుల్, పంత్, బుమ్రాలాంటి మ్యాచ్ విన్నర్లతో ఊపు మీద కనిపిస్తోంది. 2016 మెగా టోర్నీ తర్వాత భారత్ ఈ ఫార్మాట్‌లో 72 మ్యాచ్‌లాడింది. 65.3 విజయాల శాతంతో 47 గెలుపులు, 22 ఓటములతో మెరుగ్గానే కనిపిస్తోంది. ఇక టీ20 ప్రపంచక్‌పలోనూ ఆడిన 33 మ్యాచ్‌ల్లో 21 విజయాలతో మంచి రికార్డు కలిగి ఉంది. అదీగాకుండా కోహ్లీ ఆధ్వర్యంలో భారత జట్టు చివరి టీ20 టోర్నీ ఆడబోతోంది. ధోనీ సైతం మరో టైటిల్ అందించాలనే ఆశతో ఉన్నాడు. ఈ కప్‌ను ఈ ఇద్దరికి కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో సహచర ఆటగాళ్లున్నారు.


Click it and Unblock the Notifications
