Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విజయాన్ని రిపీట్ చేయడం కోహ్లీసేనకు అంత ఈజీకాదు: గంగూలీ

Sourav Ganguly Says Australia series will be tough, not going to be a repeat of 2018 tour

న్యూఢిల్లీ: అప్‌కమింగ్ ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్‌ గెలవడం భారత జట్టుకు అంతా సులువైన పని కాదని, 2018 ఫలితాన్ని రిపీట్ చేయలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. కాకపోతే కోహ్లీసేన అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే ఉందన్నాడు. తాజాగా ఇండియాటుడే ఇన్‌స్పిరేషన్‌ కార్యక్రమంలో మాట్లాడిన దాదా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

బ్యాటింగ్ చేస్తేనే..

బ్యాటింగ్ చేస్తేనే..

‘ఇది కచ్చితంగా కఠినమైన సిరీసే. మునుపటి(2018) పర్యటనలా ఏ మాత్రం ఉండబోదు. ఆస్ట్రేలియా ఇప్పుడు బలమైన జట్టు. మనది కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉంది. అయితే, మన వాళ్లు అక్కడ అద్భుతంగా బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. అత్యుత్తమ జట్లు విదేశాల్లో బ్యాటింగ్‌ బాగా చేస్తాయి. నా సారథ్యంలోని టీమిండియా.. టెస్టుల్లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ దేశాల్లో 400, 500, 600 స్కోర్లు చేసేది'అని గంగూలీ గుర్తు చేసుకున్నాడు.

కోహ్లీని చీఫ్‌గా..

కోహ్లీని చీఫ్‌గా..

ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ అతడిపై దాదా ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీని తాను చీఫ్‌ అని పిలుస్తానని చెప్పాడు. అతనితో పాటు రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రాలపై కూడా తనకదే గౌరవం ఉందన్నాడు. విరాట్‌పై తనుకు ఉన్న అంచనాల నేపథ్యంలోనే అలా పిలుస్తానన్నాడు. అతనికి కూడా అదే చెబుతానన్నాడు.

‘నువ్వు విరాట్‌ కోహ్లీవి. నీ స్థాయి చాలా గొప్పగా ఉంటుంది. నవ్వు ఒంటరిగా వెళ్లినా.. జట్టుతో కలిసి బరిలోకి దిగినా.. నేను టీవీలో చూస్తూ ఆస్ట్రేలియాపై కేవలం బాగా ఆడాలని మాత్రమే కోరుకొను. ఖచ్చితంగా గెలవాలనుకుంటా. ఎందుకంటే నువ్వు అలాంటి స్థాయిని నిర్మించావు. కాబట్టి నీ స్థాయికి తగ్గట్టు ఆడాలి' అని విరాట్‌తో చెబుతానని దాదా వివరించాడు.

బీసీసీఐ బాస్‌గా ఉంటానో..

బీసీసీఐ బాస్‌గా ఉంటానో..

ఇక తన అధ్యక్ష పదవిపై స్పందించిన దాదా అది ఎంత కాలం ఉంటుందో కూడా తెలియదన్నాడు. ఈ ఏడాది చివరికల్లా తాను బీసీసీఐ బాస్‌గా ఉంటానో లేదో తెలియదని, కానీ.. కోహ్లీ కెప్టెన్సీ మాత్రం చిరస్థాయిలో మిగిలిపోతుందన్నాడు. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్‌ ఎంతో కీలకమన్నాడు. కోహ్లీతో పాటు టీమ్‌ఇండియా ఆటగాళ్లందర్నీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండమన్నట్లు చెప్పానన్నాడు. ఇక ఐసీసీ ఛైర్మన్ పదవిపై తనకు ఇప్పుడే వ్యామోహం లేదన్నాడు. తన వయసు చాలా చిన్నదని, అప్పుడే అంత పెద్ద పదవి చేపట్టాలనుకోవడం లేదన్నాడు.

మా ఎంపీలకు క్రీడల పరిజ్ఞానం సున్నా: కేంద్ర క్రీడాశాఖ మంత్రి

Story first published: Sunday, July 12, 2020, 15:46 [IST]
Other articles published on Jul 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+