గంగూలీ వేసిన బాటలోనే ధోనీ.. ఇప్పుడు కోహ్లీ కూడా!!

ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వేసిన బాటలోనే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే బాటలో విజయాలతో దూసుకెళ్తున్నాడు అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. కష్టసమయాలలో జట్టు పగ్గాలు చేపట్టి టీమిండియా రూపురేఖలనే మార్చిన గంగూలీ.. అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ను అభివృద్ధి దిశగా మరింత ముందుకు తీసుకెళుతాడని హర్భజన్ ధీమా వ్యక్తం చేశాడు.

గంగూలీ వేసిన బాటలోనే ధోనీ, కోహ్లీ:
తాజాగా హర్భజన్ సింగ్ మాట్లాడుతూ... 'గంగూలీ భారత జట్టుకు గొప్ప నాయకుడు. దాదాతో మైదానంలో ఆడాను. ఆ సమయంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అతడి కెప్టెన్సీలో టీమిండియా సరైన మార్గంలో పయనించింది. జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. గంగూలీ వేసిన బాటలోనే ఎంఎస్ ధోనీ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కూడా అదే చేస్తున్నాడు' అని హర్భజన్ అన్నాడు.

మార్క్ చూపించాడు:
'ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న దాదా.. బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి తన సత్తా నిరూపిస్తాడు. భారత క్రికెట్ అభివృద్ధి దిశగా దూసుకెళ్లే మార్గాన్ని సిద్ధం చేస్తాడు. అతడి వారసత్వంలో భారత క్రికెట్ గొప్ప స్థానానికి చేరుకుంటుంది. కొత్త వారసత్వం ప్రారంభమవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే తన మార్క్ చూపించాడు' అని హర్భజన్ పేర్కొన్నాడు.
డిసెంబర్ 19న ఐపీఎల్ ఆటగాళ్ల వేలం.. ఈసారి కోల్‌కతాలో!!

ధోనీ, కోహ్లీ అంతిమ లక్ష్యం ఒకటే:
'ధోనీ, కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఎన్నో విజయాలు సాధించింది. ఇద్దరి కెప్టెన్సీ శైలి భిన్నంగా ఉన్నా.. అంతిమ లక్ష్యం మాత్రం జట్టును గెలిపించడమే. యువ ఆటగాళ్లను వారు ఎంతో ప్రోత్సహించారు. ప్రస్తుతం భారత్ ఉత్తమ ప్రదర్శన చేస్తుంది. ఆటగాళ్లు అందరూ బాగా ఆడుతున్నారు. జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. ఇది శుభపరిణామం' అని హర్భజన్ అన్నాడు. భారత్ తరపున హర్భజన్ 103 టెస్టులు, 236 వన్డేలు, 26 టీ20లు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications