అందుకే లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ

న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఊహించని షాకిచ్చాడు. అలనాటి ఆటగాళ్లతో నిర్వహించనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ప్రారంభానికి ముందు భారత ప్రభుత్వం కోరిక మేరకు బీసీసీఐ ఏర్పాటు చేసిన చారిటీ మ్యాచ్‌లో దాదా ఆడటం లేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాలు, బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్న బిజీ వర్క్‌తోనే ఈ మ్యాచ్ బరిలోకి దిగడం లేదని గంగూలీ వివరణ ఇచ్చాడు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే.

షాకిచ్చిన దాదా..
ఈ ఉత్సవాల్లో భాగంగా వరల్డ్ ఎలెవన్, భారత జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐని కోరింది. ప్రస్తతు బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఈ తరం ఆటగాళ్లతో ఈ మ్యాచ్ సాధ్యం కాదని భావించిన బీసీసీఐ అలనాటి ఆటగాళ్లతో నిర్వహించనున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ప్రారంభానికి ముందు ఓ చారిటీ మ్యాచ్ ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇండియా మహరాజస్ టీమ్‌ను సౌరవ్ గంగూలీ నడిపిస్తాడని, వరల్డ్ ఎలెవన్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహిస్తాడని తెలిపింది. లెజెండ్స్ లీగ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు సెప్టెంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుందని పేర్కొంది.

బిజీ వర్క్ కారణంగానే..
దాంతో దాదా ఆటను మళ్లీ చూడవచ్చని అభిమానులు ఆశించారు. కానీ వారి ఆశలపై గంగూలీ నీళ్లు చల్లాడు. వ్యక్తిగత కారణాలతో ఈ మ్యాచ్‌కు దూరంగా ఉంటున్నట్లు ఇండియా టుడేకు వెల్లడించాడు. 'లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ సూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా. అలనాటి ఆటగాళ్లను మళ్లీ మైదానంలో తీసుకురావాలనే ఉద్దేశం బాగుంది. లెజెండ్స్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న చారిటీ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఇచ్చినందుకు నిర్వహకులకు ధన్యవాదాలు.

మ్యాచ్ ప్రత్యక్షంగా చూస్తా..
అయితే వృత్తిపరమైన కమిట్ మెంట్స్, బీసీసీఐ ప్రెసిడెంట్‌గా తీరిక లేని పని కారణంగా నేను ఈ మ్యాచ్ ఆడటం లేదు. ఇక ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారనే విషయం తెలుసు. ఈ టోర్నీని చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు. ఈ లీగ్ క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లగలదు. అయితే ఈ మ్యాచ్ ఆడకపోయినా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రత్యక్షంగా వీక్షిస్తాను'అని దాదా పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications