నిలకడగా దాదా ఆరోగ్యం.. రెండు రోజుల్లో ఇంటికి!

కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చికిత్స అందిస్తోన్న వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్ డాక్టర్లు వెల్లడించారు. బుధవారం డిశ్చార్జ్ చేస్తామని కూడా తెలిపారు. ఇంట్లో ట్రేడ్‌మిల్ చేస్తుండగా హార్ట్ ఎటాక్‌కు గురైన టీమిండియా మాజీ కెప్టెన్ శనివారం స్థానిక వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. దాదా హార్ట్‌లో మూడు బ్లాక్స్ గుర్తించిన డాక్టర్లు వెంటనే సర్జరీ చేసి ఒక స్టెంట్ వేశారు. దాంతో దాదాకు ప్రాణాపాయం తప్పింది.

మెడికల్ టీమ్ సమావేశం..
సర్జరీ అనంతరం సౌరవ్ సేఫ్‌గా ఉన్నాడని, ఫాస్ట్‌గా రికవర్ అవుతున్నాడని వుడ్‌ల్యాండ్స్ మెడికల్ టీమ్ కూడా ప్రకటించింది. సోమవారం మరోసారి పరీశీలించిన వైద్యులు దాదా కోలుకున్నాడని, బుధవారం డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. తమ వైద్య బృందం గంగూలీ కుటుంబ సభ్యులతో సంప్రదించిందని, గుండె రక్తనాళాల్లో రెండు చోట్ల పూడికలను పూడ్చడానికి చేయాల్సిన యాంజియోప్లాస్టీ సర్జరీని వాయిదావేసామని వుడ్ ల్యాండ్ ఆసుపత్రి ఎండీ, సీఈవో రూపాలి బసు మీడియాకు తెలిపారు.

వాయిదా వేసాం..
‘మా తొమ్మిది మంది సభ్యులు గల మెడికల్ బోర్డు ఈ ఉదయం 11.30 గంటలకు గుండె సంబంధిత స్పెషలిస్ట్‌లతో జూమ్ వేదికగా సమావేశమయ్యారు. ప్రస్తతుం దాదా ఆరోగ్యం నిలకడగా ఉండటంతో యాంజియోప్లాస్టీ సర్జరీ వాయిదా వేయడం ఉత్తమమని మా మెడికల్ టీమ్ ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ సమావేశంలో గంగూలీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వారికి అర్థమయ్యేలా వివరించాం'అని బసు పేర్కొన్నారు. ఇక చికిత్సలో భాగంగా 48 ఏళ్ల గంగూలీకి కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చింది.

మైదానంలో ‘దాదా'గిరి
ఇక గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశాడు. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా.. 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1349 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్ 10 వికెట్లని దాదా పడగొట్టారు.
మీడియం పేస్ బౌలింగ్‌తో దాదా ఆకట్టుకున్నాడు. ఇటీవల బీసీసీఐ బోర్డు మెంబర్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లోనూ దాదా హాఫ్ సెంచరీతో మెరిసాడు. అంత ఫిట్‌గా ఉండే దాదాకు గుండెపోటు రావడం అందర్నీ విస్మయపరిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications