Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మిమ్మల్ని చూసి గర్విస్తున్నా: గంగూలీ

Sourav Ganguly in awe of Kolkata Police as cops shift fallen trees after Cyclone Amphan

కోల్‌కతా: భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్‌ గంగూలీ కోల్‌కతా పోలీసులపై ప్రశంసల జల్లు కురుపించాడు. ప్రపంచమంతా కరోనా వైరస్‌తో అల్లాడుతుంటే.. అది చాలదన్నట్టు పశ్చిమ బెంగాల్‌ను ఉంపన్‌ తుపాను అతలాకుతలం చేస్తుంది. ఈ క్రమంలో తుపాను ధాటికి పెద్ద పెద్ద చెట్లు నేలకూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ పోలీసు అధికారి స్థానికుల సాయంతో ఆ చెట్లను పక్కకు లాగి, రోడ్ క్లియర్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను రెండు రోజుల క్రితం కోల్‌కతా సౌత్‌ ఈస్ట్‌ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

చాలా మంది నెటిజన్లు ఆ పోలీస్‌ను కొనియాడుతూ రీట్వీట్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసిన గంగూలీ కూడా సదరు పోలీస్‌ను కొనియాడాడు. 'కోల్‌కతా పోలీసులను చూసి ఎంతో గర్విస్తున్నాం'అని ప్రశంసిస్తూ ఆ వీడియోను రీట్వీట్‌ చేశాడు.

ఇక ఉంపన్‌ ధాటికి రాష్ట్ర రాజధాని కోల్‌కతా చిగురుటాకులా వణికిపోతుంది. గంటకి 190 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తూ నగరాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పార్క్‌ చేసిన కార్లు గాలుల ధాటికి తిరగబడ్డాయి. కోల్‌కతాలో తుపాను బీభత్స దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రహదారులకి ఇరువైపులా ఉన్న వందలాది చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోయాయి. భారీ తుపాను కారణంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది మృత్యువాత పడ్డారు. ఉంపన్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు.

Story first published: Friday, May 22, 2020, 13:11 [IST]
Other articles published on May 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+