ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లోనే జరుగుతుందని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. కోల్‌కతా నుంచి ఈ మ్యాచ్‌ను తరలించలేరని చెప్పాడు. బీసీసీఐతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపాడు. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌ను బీసీసీఐ వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో ఐపీఎల్ 2025 సీజన్ తిరిగి ప్రారంభమైంది.
బీసీసీఐ రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. భద్రత పరంగా లీగ్ మ్యాచ్‌ల కోసం 6 వేదికలను బీసీసీఐ ఎంపిక చేసింది. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను ఖరారు చేయలేదు. అహ్మదాబాద్, ముంబై వేదికగా ప్లే ఆఫ్స్, ఫైనల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, కోల్‌కతా వేదికగా ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించాల్సింది. కానీ వర్ష ప్రభావం నేపథ్యంలోనే బీసీసీఐ వేదికలను మార్చాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫైనల్‌ను కోల్‌కతా నుంచి తరలించడంపై అక్కడి ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శనివారం కొందరు ఈడెన్ గార్డెన్స్ ముందు ధర్నా కూడా చేశారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన గంగూలీ.. ఐపీఎల్ 2025 ఫైనల్ కోల్‌కతా వేదికగా జరుగుతుందని చెప్పాడు.'బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఫైనల్‌ను తరలించడం అంత ఈజీ కాదు. అది ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన మ్యాచ్. అక్కడే జరుగుతుందని ఆశిస్తున్నా. నిరసనతో పెద్దగా ఉపయోగం ఉండదు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌తో బీసీసీఐకి మంచి సంబంధాలు ఉన్నాయి.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.