
భారత్‌లో అసలు కుదరదు
ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత మిగతా ఐపీఎల్ 2021 మ్యాచ్‌లను నిర్వహిస్తారా అని సౌరవ్ గంగూలీని ప్రశ్నించగా.. 'అది ఇప్పుడు సాధ్యం కాదు. భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళుతోంది. కరోనా వైరస్ కారణంగా 14 రోజుల క్వారంటైన్‌లాంటి కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఐపీఎల్ 2021 మ్యాచులు భారత్‌లో అసలు కుదరదు. ఈ క్వారంటైన్ చాలా కష్టం. ఐపీఎల్‌ను పూర్తి చేయగలమా లేదా అన్నది ఇప్పుడే ఏమీ చెప్పలేము. విదేశీ ఆటగాళ్లు కూడా అందుబాటులో ఉండాలి. విదేశీ జట్ల షెడ్యూల్ కూడా చూసుకోవాలి. ఇలా చాలా విషయాలను మేము పరిగణలోకి తీసుకోవాలి' అని అన్నారు.

అందువల్లే ఈ పరిస్థితి
ముందుగానే ఐపీఎల్ 2021ను రద్దు చేసి ఉండాల్సిందన్న విమర్శలపైనా దాదా స్పందించారు. 'ముంబై, చెన్నైలలో ఇలా జరగలేదు. ఢిల్లీ, అహ్మదాబాద్ వెళ్లినప్పుడు బబుల్‌లోకి కూడా కరోనా వచ్చింది. ఆ సమయంలో దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. గతేడాది డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకూ చాలా తక్కువ కేసులు ఉండటంతో.. ఇంగ్లండ్ సిరీస్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్‌ను విజయవంతంగా నిర్వహించాం. కొన్ని వందల మంది ప్లేయర్స్ బబుల్‌లో ఉన్నా.. ఏ సమస్యా రాలేదు. ఇప్పుడు మాత్రం క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరించారు.
'విరాట్ కోహ్లీ మాతో కలిసి జోకులు వేస్తాడు.. చెడ్డి దోస్త్ లాగే ఉంటాడు'

అన్నీ మొదటి నుంచీ మొదలవుతాయి
'ఇంగ్లిష్ ప్రిమియర్ లీగ్‌లోనూ కరోనా కేసులు వచ్చాయి. అయినా వాళ్లు లీగ్‌ను కొనసాగించారు. ఐపీఎల్ టోర్నీ మాత్రం అలా కాదు. వారం పాటు ఆపితే.. ఇక అంతే. ప్లేయర్స్ ఇళ్లకు వెళ్లిపోతారు. విదేశీ ఆటగాళ్లు విషయంలో ఆలోచించాలి. ప్లేయర్స్ మళ్లీ వస్తే.. క్వారంటైన్ ఉంటుంది. ఇలా అన్నీ మొదటి నుంచీ మొదలవుతాయి. ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌లను పూర్తి చేయడంపై ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని' అని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డారు. కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ఈ ఏడాది ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో మిగిలిన 31 ఐపీఎల్ మ్యాచ్‌లు భారత్‌లో జరిగే అవకాశం లేదని గంగూలీ చెప్పకనే చెప్పారు.

జూలైలో శ్రీలంక పర్యటన
జూలైలో భారత జట్టు శ్రీలంకలో పర్యటించి మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొంటుందని సౌరవ్ గంగూలీ తెలిపారు. న్యూజిలాండ్‌తో టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత బృందం జూన్ 2న ఇంగ్లండ్‌కు బయలుదేరనుంది.
ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లెవరూ పాల్గొనే అవకాశం లేదు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాలేకపోయిన భారత ఇతర ఆటగాళ్లను శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక చేస్తారు. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను వీక్షించేందుకు సౌరవ్ గంగూలీతో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షా ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌లో ఐపీఎల్ 2021 నిర్వహణ సాధ్యాసాధ్యాలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో చర్చించే అవకాశముందని సమాచారం.


Click it and Unblock the Notifications












