పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌పై భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ తన గౌరవాన్ని కోల్పోయిందని తెలిపాడు. ఆ జట్టులో నాణ్యత లోపించిందని, భారత్‌కు కనీసం పోటీ కూడా ఇవ్వలేదని అభిప్రాయపడ్డాడు. ఆసియాకప్ 2025 టోర్నీలో పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. గత ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్లతో భారత్ ఓడించింది. ఈ మ్యాచ్‌పై తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడిన గంగూలీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, పాక్ మ్యాచ్‌ను 15 ఓవర్లు మాత్రమే చూశానని, ఆ తర్వాత ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ వీక్షించానని చెప్పాడు.
'పాకిస్థాన్ జట్టు ఏ దశలోనూ కనీస పోటీ ఇవ్వలేదు. అసలు ఆ జట్టులో నాణ్యమైన ఆటగాళ్లే లేరు. టీమిండియా మాత్రం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు లేకుండానే టోర్నీలో రాణిస్తోంది. ఆసియా కప్ 2025లో టీమిండియా.. పాకిస్థాన్‌తో పాటు మిగతా అన్ని జట్ల కంటే కూడా భారత్ ఎంతో ముందంజలో ఉంది. భారత్ ఎప్పుడూ అత్యుత్తమ జట్టే.

ఈ మ్యాచ్ ఫలితం చూసి నేనేం ఆశ్చర్యపోలేదు. వాస్తవానికి ఈ మ్యాచ్‌ను నేను తొలి 15 ఓవర్లు మాత్రమే చేశాను. ఆ తర్వాత ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ చూశాను. భారత్, పాక్ మ్యాచ్‌లు అంటే గతంలో మాది ఉత్కంఠగా సాగడం లేదు. భారత్‌కు పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వడం లేదు. మ్యాచ్‌లన్నీ ఏకపక్షంగా సాగుతున్నాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ల కంటే, భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక మ్యాచ్‌లు ఆసక్తిగా ఉంటున్నాయి. చివరకు భారత్, అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లు కూడా ఉత్కంఠగా సాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ మ్యాచ్‌కు ఇంత హైప్ అవసరం లేదు. ఇప్పుడంతా ఏకపక్షమే.'అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.