BCCI నుంచి సౌరవ్ గంగూలీ ఔట్.. బీజేపీ రాజకీయాలకు బలి! ఐపీఎల్ చైర్మన్ పదవిని తిరస్కరించి దాదా!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ కథ ముగిసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్టోబర్ 18న బీసీసీఐ ఎన్నికలు జరగనుండగా.. తదుపరి అధ్యక్షుడిగా కొనసాగేందుకు 1983 ప్రపంచకప్ విన్నర్ రోజర్ బిన్నికి మార్గం సుగుమమైంది. ఇటీవల బీసీసీఐ పెద్దలు ఢిల్లీ వేదికగా సమావేశం కాగా.. నామినేషన్లపై చర్చించినట్లు తెలుస్తోంది. రోజర్ బిన్నిని తదుపరి ప్రెసిడెంట్ కొనసాగేందుకు బోర్డు సభ్యులు అంగికరించారని, గంగూలీని పదవిని వదులుకోవాలని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఐసీసీ ప్రెసిడెంట్ రేసుకు దాదా పోటీపడాలని సూచించారని, లేకుంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవి తీసుకోవాలని ఆఫర్ చేసినట్లు ప్రముఖ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది.

తప్పుకోనున్న దాదా...
అయితే దాదా మాత్రం బీసీసీఐ ప్రెసిడెంట్‌గానే కొనసాగేందుకు పట్టుబట్టినట్లు తెలుస్తోంది. బీసీసీఐ ప్రెసిడెంట్‌గా చేసిన తనను ఐపీఎల్ చైర్మన్‌గా ఉండమనడం సమంజసం కాదని, దాదా బోర్డు సభ్యులతో అన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారి ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.
జై షా సెక్రటరీగానే కొనసాగనుండగా.. రాజీవ్ శుక్లా వైస్ ప్రెసిడెంట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అరుణ్ సింఘ్ ధూమల్ ఐపీఎల్ చైర్మన్ అయ్యే అవకాశాలున్నాయి.

అధ్యక్షుడిగా చేసిందేం లేదంటూ..
బీసీసీఐ ప్రెసిడెంట్‌గా దాదా విఫలమయ్యాడని, బోర్డు కార్యకలపాల్లో చురుకుగా ఉండటం లేదని సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పేరుకే ప్రెసిడెంట్ తప్పా.. ఏ బాధ్యతను కూడా తీసుకోలేదని, అందుకే అతన్ని ప్రెసిడెంట్‌గా ఉంచేందుకు నిరాకరిస్తున్నామని సభ్యులు దాదా ముందే చెప్పినట్లు సమాచారాం. ఏది ఏమైనప్పటికీ.. బీసీసీఐలో పెద్దలంతా దాదాకు వ్యతిరేకంగా ఉన్నట్లు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

బీజేపీ రాజకీయాలకు..
ఇక గంగూలీని కావాలనే బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. బీజేపీ రాజకీయాలకు దాదా బలయ్యాడని, తృణముల్ కాంగ్రెస్ పార్టీతో అతనికి ఉన్న సాన్నిహిత్యాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. క్రికెట్‌కు ఏ మాత్రం సంబంధం లేదని జైషా సెక్రటరీగా కొనసాగేందుకు లేని ఇబ్బంది.. మాజీ కెప్టెన్ అయిన దాదా ప్రెసిడెంట్‌గా కొనసాగితే వచ్చే కష్టం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు దాదా సిద్దంగా లేకపోవడంతోనే ఆ పార్టీ పెద్దలు అతనిపై ఆగ్రహంగా ఉన్నారని, ఈ క్రమంలోనే అతన్ని బీసీసీఐకి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications