Sourav Ganguly: తెరపైకి దాదా బయోపిక్.. బీసీసీఐ బాస్ పాత్రలో రణబీర్ కపూర్!

ముంబై: ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, మహమ్మద్ అజారుద్దీన్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్స్ వెండితెరపై ప్రేక్షకులను కనువిందు చేశాయి.
ఈ క్రమంలోనే దాదా బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. బయోపిక్‌కు ఇన్నాళ్లు ససేమిరా అన్న దాదా.. తాజాగా అంగీకరించాడని తెలుస్తోంది. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని, గంగూలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించనున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.

బయోపిక్‌పై దాదానే..
ఇక బయోపిక్‌కు సంబంధించిన వివరాలు ఇటీవల సౌరవ్ గంగూలీనే వెల్లడించాడు. న్యూస్ 18 బంగ్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోపిక్ గురించి ప్రస్తావించగా.. తాను అంగీకరించినట్లు తెలిపాడు. అంతేకాకుండా ఆ డైరెక్టర్, హీరో ఎవరనే విషయాలను ఇప్పుడే చెప్పలేనని, అధికారిక ప్రకటన రావడానికి కొంత సమయం పడుతుందన్నాడు. 'అవును.. నా బయోపిక్ ప్రాజెక్ట్‌కు అంగీకరించాను. హిందీలోనే తెరకెక్కనుంది. కానీ ఇప్పుడే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలు, డైరెక్టర్, హీరో ఎవరో చెప్పలేను. అన్ని ఫైనలైజ్ కావడానికి కొంత సమయం పడుతుంది'అని దాదా తెలిపాడు.

రేసులో రణబీర్ కపూర్?
బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం దాదా బయోపిక్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందంట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నిర్మాణ సంస్థ పలుమార్లు దాదాను కలిసి ఒప్పించిందంట. ప్రధాన పాత్రదారుడు ఎవరనేదానిపై కూడా ఓ నిర్ణయానికి వచ్చారంట. రణబీర్ కపూర్ ముందంజలో ఉన్నాడని, మరో ఇద్దరు నటులను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అంతకు ముందు ఒకసారి నటి నేహా దుపియా గంగూలీ పాత్రకు హృతిక్ రోషన్ సరిగ్గా సరిపోతాడని తెలిపింది. అయితే దీనిపై గంగూలీ స్పందిస్తూ ముందు హృతిక్ తనలా మారాల్సి ఉంటుందన్నాడు. అతని శరీరం కండలతో ఉందన్నాడు.

నగ్మాతో ప్రేమాయణం కూడా..
ఇక ఈ బయోపిక్‌లో దాదా జీవిత ప్రయాణాన్ని చూపిస్తారని సమాచారం. యువ క్రికెటర్‌గా ప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి కష్టకాలంలో కెప్టెన్‌గా జట్టును నడిపించిన తీరు.. లార్డ్స్‌లో సాధించిన చారిత్రాత్మక విజయంతో పాటు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేవరకు దాదా జీవితంలో అన్నీ కోణాలు చూపిస్తారని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. మాజీ హీరోయిన్ నగ్మాతో ప్రేమాయణం, బ్రేకప్‌కు సంబంధించిన సన్నివేశాలు కూడా ఉంటాయన్నారు. అయితే దాదా బయోపిక్‌కు సంబంధించిన వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అనేక సార్లు బయోపిక్ సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఈసారి దాదానే చెప్పడం ఆసక్తికరమైన విషయం.

భారత్ క్రికెట్ ఎదిగిన తీరు..
ఇక దాదా బయోపిక్‌కు సంబంధించిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గతంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 'సచిన్ టెండూల్కర్ బయోపిక్ తీస్తే.. అది మాస్టర్ క్రికెట్‌లో ఎదిగిన విధానాన్ని చూపిస్తుంది. అలాగే ధోనీ బయోపిక్‌లో మహీ ఎదిగిన విధానం మాత్రమే తెలుస్తోంది. అదే గంగూలీ బయోపిక్ తీస్తే భారత జట్టు ఎదిగిన పరిస్థితులను చూపిస్తుంది'అని ఓ సందర్భంలో సెహ్వాగ్ కామెంట్ చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకొని అల్లాడుతున్న భారత క్రికెట్‌కు దాదా సారథిగా వెలుగులు నింపాడు. ఇంటలిజెన్స్ కెప్టెన్సీతో దూకుడైన నిర్ణయాలతో భారత క్రికెట్‌లో ఓ విప్లవం తీసుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications