For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంభీర్.. ధోనీలు బీజేపీ నుంచి పోటీ చేయనున్నారా?

Dhoni, Gautam Gambhir likely to contest 2019 Lok Sabha polls on BJP ticket

హైదరాబాద్: మరి కొద్ది నెలల్లో రాజకీయ పరీక్షలు మొదలుకానుండటంతో పార్టీలు ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టేశాయి. ఏ స్థానానికి ఎవరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న రాజకీయ పార్టీలు అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా సీనియర్‌ క్రికెటర్లు మహేంద్రసింగ్‌ ధోని, గౌతం గంభీర్‌లు రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ

వీరిద్దరూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గంభీర్‌, ధోనిలతో కమలనాథులు ఓ దఫా చర్చలు కూడా జరిపినట్లు ప్రముఖ పత్రిక 'ది సండే గార్డియన్‌' ఓ కథనంలో పేర్కొంది. న్యూఢిల్లీ ఎంపీ మీనాక్షి లేఖి పనితీరుపై బీజేపీ పార్టీ వర్గాలు, అనుచరులు అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలో 2019లో గంభీర్‌ను ఆమె బదులు పోటీ చేయించాలని బీజేపీ కసరత్తు చేస్తోందన్నట్లుగా ప్రచురించింది.

స్టార్‌ క్యాంపైనర్‌లుగా నియమించుకోవాలని

స్టార్‌ క్యాంపైనర్‌లుగా నియమించుకోవాలని

పైగా గంభీర్‌ స్వస్థలం ఢిల్లీ అని, సైన్యం, కాల్పులు, దేశభక్తి అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తాడని, అందుకే గంభీర్‌ను పోటీచేయించాలని భావిస్తున్నట్లు ఓ బీజేపీ సీనియర్‌ నేత పేర్కొన్నట్లు ఆ కథనంలో తెలిపింది. అలాగే జార్ఖండ్‌ నుంచి ధోనిని పోటీ చేయించాలని ప్రయత్నిస్తోందట. ఒకవేళ ఇది కుదరకపోయినట్లయితే దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న వీరిద్దరినీ స్టార్‌ క్యాంపైనర్‌లుగా నియమించుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు వెల్లడించింది.

రికార్డులు బద్దలు కొట్టి.. సచిన్, వార్నర్‌ల సరసన రోహిత్

ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచకప్‌ వదులుకోడని

ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచకప్‌ వదులుకోడని

అంతర్జాతీయ క్రికెట్‌ వీడ్కోలు చెప్పని ఈ ఇద్దరు ఆటగాళ్లు రాజకీయాల్లోకి వస్తున్నారంటే క్రికెట్‌ అభిమానులు మాత్రం నమ్మడం లేదు. 2019 ఎన్నికల సమయంలో ధోని ప్రపంచకప్‌ ఆడుతాడని, అతను ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచకప్‌ వదులుకోడని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బహిరంగంగా విమర్శించే గంభీర్‌ కూడా

బహిరంగంగా విమర్శించే గంభీర్‌ కూడా

చాలా విషయాల్లో రాజకీయనాయకులను బహిరంగంగా విమర్శించే గంభీర్‌ కూడా రాజకీయాల్లో చేరే ప్రసక్తే లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం గంభీర్‌ ఢిల్లీ తరుపున దేశవాళి క్రికెట్‌ ఆడుతుండగా.. ధోని వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో బిజీగా ఉ‍న్నాడు.

Story first published: Tuesday, October 23, 2018, 10:30 [IST]
Other articles published on Oct 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+