Kaun Banega Crorepati షోలో గంగూలీ, సెహ్వాగ్ .. 40 వేల ప్రశ్నగా కేటీఆర్ ట్వీట్!

న్యూఢిల్లీ: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి(KBC)షోలో టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సందడి చేసిన విషయం తెలిసిందే. అమితాబ్ అడిగిన ప్రశ్నలకు ఈ దిగ్గజ ఆటగాళ్లు ఆసక్తికర సమాధానాలు చెబుతూ నవ్వులు పూయించారు. అయితే ఈ షోలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన ప్రశ్న అడగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనికి సబంధించిన ట్వీట్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

అసలు సంగతేంటంటే
ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. ప్రజల సమస్యలపై వేగంగా స్పందిస్తుంటారు. ఈ క్రమంలో కరోనా సమయంలో ఆయన అనేక విషయాలను నెటిజన్లతో పంచుకున్నారు. ప్రాణాంతక వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కరోనా చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ లిస్ట్‌ను కేటీఆర్ గతంలో ట్విటర్ వేదికగా పంచుకుంటూ.. వీటిని సరిగ్గా పలికే వారున్నారా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా.. దీని వెనుక కచ్చితంగా ఈయన హస్తం ఉండే ఉంటుందని చమత్కరిస్తూ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్‌ని ట్యాగ్ చేశారు.
గంగూలీ స్మార్ట్ ఆన్సర్..
అయితే సెటైరికల్‌గా సరదాగా చేసిన ఈ ట్వీటే అమితాబ్ 'కేబీసీ'లో రూ. 40 వేల ప్రశ్నగా మారింది. హాట్ సీట్‌లో ఉన్న సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ జనరల్ నాలెడ్జ్‌కు పరీక్షగా నిలిచింది. కరోనా మెడిసిన్స్‌కు సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్ సరదాగా చేసిన ట్వీట్‌లో ఏ రాజకీయ నాయకుడిని ట్యాగ్ చేశారని దాదా, సెహ్వాగ్‌లను అమితాబ్ ప్రశ్నించారు.
సమాధానాల్లోని నాలుగు ఆప్షన్స్‌గా కపిల్ సిబల్, సుబ్రమణ్యస్వామి, అమితావ్ గోష్, శశిథరూర్ పేర్లను సూచించారు. ఈ ప్రశ్నకు సౌరవ్ గంగూలీ, చాలా స్మార్ట్‌గా ఆలోచించి శశిథరూర్ అని కరెక్ట్ సమాధానం చెప్పారు. ఇంగ్లీష్‌పై పట్టు అంటే రాజకీయ వర్గాల్లో ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది పేరు శశి థరూర్ కాబట్టే అతనే అయ్యుంటాడని పేర్కొన్నాడు.
కేటీఆర్ సంతోషం..
ఈ ప్రశ్నకు సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ కాగా.. కృష్ణ అనే టీఆర్‌ఎస్ వీరాభిమాని దాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇది చూసి ఒకింత ఆశ్చర్యానికి గురైన కేటీఆర్ చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఏదో సరదాగా చేసిన ట్వీట్ ఇలా కేబీసీలో ప్రశ్నగా రావడం ఆనందంగా ఉందన్నాడు. దాదా, సెహ్వాగ్ సరైన సమాధానం చెప్పారనుకుంటున్నానని ఆయన ట్వీట్ చేశాడు.

రూ. 25 లక్షలు సొంతం..
ఈ షోలో సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ రూ.25లక్షలు గెలిచారు. అయితే సెహ్వాగ్, గంగూలీ రూ.50 లక్షల ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయారు. ఆ ప్రశ్న ఏంటంటే.. ఆజాద్ హింద్ రేడియో సేవలు మొదట నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో 1942లో ఏ దేశంలో మొదలయ్యాయి?. జపాన్, జర్మనీ, సింగపూర్, బర్మా.. ఆప్షన్స్ ఇవ్వగా దాదా, వీరూ నిర్దేశిత సమయంలో జవాబు చెప్పలేదు. దాంతో భారత మాజీలు రూ.50 లక్షలు గెలవలేకపోయారు. సరైన సమాధానం జర్మనీ. అయితే గెలుచుకున్న రూ.25 లక్షలను ధార్మిక పనుల కోసం వారు విరాళంగా ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications