Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌరవ్ గంగూలీకి హార్ట్ ఎటాక్.. సాయంత్రం ఆపరేషన్!!

Sourav Ganguly admitted to woodland Hospital in Kolkata after experience chest pain

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో చేరారు. శనివారం ఉదయం గంగూలీకి ఛాతినొప్పి (హార్ట్ ఎటాక్) రావడంతో.. హుటాహుటిన ఆయనను పశ్చిమ బెంగాల్‌లోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. గంగూలీకి ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నికలడగానే ఉందట. ఈ రోజు సాయంత్రం దాదాకు సర్జరీ జరగనుందని సమాచారం. విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

గంగూలీకి అస్వస్థత:

గంగూలీకి అస్వస్థత:

కోల్‌కతాలోని తన నివాసంలో శనివారం ఉదయం జిమ్‌ చేస్తుండగా సౌరవ్ గంగూలీ అస్వస్థతకి గురయ్యాడు. దాదాకు చాతీలో నొప్పి రావడంతో కిందపడిపోయి విలవిల్లాడిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించగా.. గుండె పోటుగా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం డాక్టర్‌ సరోజ్‌ మోండల్‌ పర్యవేక్షణలో దాదా చికిత్స పొందుతున్నారు. ఈరోజు సాయంత్రం సౌరవ్‌కు యాంజియో ప్లాస్టీ చేయనున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

నిలకడగానే దాదా ఆరోగ్యం:

నిలకడగానే దాదా ఆరోగ్యం:

'ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నాం. ఆయనకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది' అని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశాడు. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా.. 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1349 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్‌ 10 వికెట్లని దాదా పడగొట్టారు. మీడియం పేస్ బౌలింగ్‌ దాదా ఆకట్టుకున్నాడు.

షర్ట్ విప్పి గిరగిరా తిప్పిన దాదా:

షర్ట్ విప్పి గిరగిరా తిప్పిన దాదా:

టీమిండియాకి దూకుడు నేర్పిన కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ కితాబులు అందుకున్నాడు. విదేశీ గడ్డపైనా భారత్‌కి చిరస్మరణీయమైన విజయాల్ని అందించాడు. లార్డ్స్ స్టేడియంలో షర్ట్ విప్పి గిరగిరా తిప్పిన దాదా.. అప్పట్లో క్రికెట్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేశాడు. దాదా సారథిగా ఉన్నపుడే వీరేందర్ సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ, ఆశిష్ నెహ్రా, ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి యువకులు జట్టులోకి వచ్చారు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేసిన దాదా.. ఇప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్‌గా ఉన్నాడు.

టీ20 ట్రోఫీ ఏర్పాట్లలో బిజీ:

టీ20 ట్రోఫీ ఏర్పాట్లలో బిజీ:

జనవరి 10 నుంచి ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీకి ఏర్పాట్లని సౌరవ్ గంగూలీ ప్రస్తుతం సమీక్షిస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తర్వాత భారత్‌లో జరుగుతున్న తొలి దేశవాళీ టోర్నీ కావడంతో.. మ్యాచ్‌ల నిర్వహణని బీసీసీఐ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో దాదా పూర్తిసమయం టీ20 ట్రోఫీకే కేటాయిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో-సెక్యూర్ వాతావరణంలో ఈ టోర్నీని నిర్వహిస్తామని ఇటీవల దాదా చెప్పిన విషయం తెలిసిందే.

టీమిండియా క్రికెటర్లకు అభిమాని ఊహించని సర్‌ప్రైజ్‌.. అస్సలు బాగోదన్న రోహిత్‌ (వీడియో)

Story first published: Saturday, January 2, 2021, 14:47 [IST]
Other articles published on Jan 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+