Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2025: 10 సెకన్ల యాడ్‌కు రూ. 16 లక్షలు!

ఆసియా కప్ 2025 టోర్నీకి రంగం సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ టోర్నీ బరిలో నిలిచే 8 జట్లు ఆటగాళ్ల ఎంపికపై కసరత్తులు చేస్తుండగా.. మరోవైపు అధికారిక బ్రాడ్‌కాస్టర్ సోనీ నెట్‌వర్క్‌ స్పాన్సర్ల వేటను ప్రారంభించింది. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ టోర్నీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరు దేశాల అగ్రనేతలు మాటల తూటలు పేల్చుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఆసియా కప్ వేదికగా జరిగే భారత్-పాక్ మ్యాచ్‌పై భారీ హైప్ నెలకొంది. ఇరు దేశాలు ఈ పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. గెలుపే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. ఈ హైప్‌ను క్యాష్ చేసుకునే పనిలో అధికారిక బ్రాడ్‌‌కాస్టర్ సోనీ నెట్‌వర్క్ పడింది. ఆసియా కప్‌కు సంబంధించిన యాడ్స్ టారిఫ్‌ను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఆసియాకప్‌లో భారత్ ఆడే మ్యాచ్‌ల సమయంలో వచ్చే 10 సెకన్ల యాడ్‌కు రూ. 14-16 లక్షల ధరను ఫిక్స్ చేసినట్లు ఓ నివేదిక పేర్కొంది. భారత్-పాక్ మ్యాచ్‌కు ఈ రేట్లు ఇంకా భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Sony Sets High TV Ad Rates for Asia Cup 2025 India Matches Report

ఈ నివేదిక ప్రకారం టీవీ అడ్వర్టైజింగ్ కో ప్రెజెంటింగ్ స్పాన్సర్‌షిప్ ప్యాకెజ్ రూ. 18 కోట్లుగా.. అసోసియేట్ స్పాన్సర్‌షిప్ ప్యాకేజి రూ. 13 కోట్లుగా నిర్ణయించినట్లు సమాచారం. స్పాట్-బై ప్యాకేజ్(భారత్+ ఇతర మ్యాచ్‌లు)‌లకు 10 సెకండ్ల యాడ్‌కు రూ. 16 లక్షలు.. మొత్తంగా రూ. 4.48 కోట్లుగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సోనీ లివ్ వేదికగా డిజిటల్ అడ్వర్టైజింగ్ కో ప్రెజెంటింగ్, హైలైట్స్ పార్ట్‌నర్ రూ. 30 కోట్లు, కో పవర్డ్ ప్యాకేజ్ రూ. 18 కోట్లుగా నిర్ణయించారు. భారత మ్యాచ్‌ల కోసం 30 శాతం డిజిటల్ యాడ్స్ రిజర్వ్ చేశారంట.

ఫార్మాట్ యాడ్ రేట్స్

ప్రీ రోల్ యాడ్స్: రూ.275(భారత మ్యాచ్‌లకు రూ. 500, భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు రూ. 750)

మిడ్ రోల్ యాడ్స్: రూ. 225(భారత మ్యాచ్‌లకు రూ. 400, భారత్-పాకిస్థాన్ రూ. 600)

కనెక్టెడ్ టీవీ యాడ్స్: రూ. 450( భారత మ్యాచ్‌లకు రూ. 800, భారత్, పాక్ మ్యాచ్‌కు రూ. 1200)

సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ షురూ

యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నీ‌లో తలపడుతుండగా.. యూఏఈ, పాకిస్థాన్, ఒమన్‌లతో కలిసి భారత్ గ్రూప్-ఏలో ఉంది. భారత్, పాక్ జట్లు మెరుగైన ప్రదర్శన చేస్తే మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. అదే జరిగితే మాత్రం బ్రాడ్ కాస్టర్ పంట పండుతుంది.

గ్రూప్ స్టేజ్ షెడ్యూల్ - భారత్ మ్యాచ్‌లు:

సెప్టెంబర్ 10: భారత్ vs యుఏఈ (దుబాయ్)

సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్ (దుబాయ్)

సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్ (అబూదాబి)

Story first published: Monday, August 18, 2025, 11:15 [IST]
Other articles published on Aug 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+