For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధావన్ భాయ్.. నీలానే ప్రతీ వలస కూలీ ఇంటికి చేరేవరకు క్రీజులో ఉంటా: సోనూసూద్

Sonu Sood responds to Shikhar Dhawan’s praise for helping labourers

ముంబై: కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కూలీలకు ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ అండగా నిలిచిన విషయం తెలిసిందే. కరోనా కకాలవికలంతో అస్తవ్యస్తమైన వలస జీవులను సొంతూర్లకు తరలించేందుకు ఈ బాలీవుడ్ యాక్టర్ సొంత ఖర్చుతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు తీసుకోని వేలాది మంది వలస కూలీలను వారి సొంతూళ్లకు పంపించారు.

నా బిగ్ సెల్యూట్

ఇప్పటికే అతను చేసిన ఈ సాయంపై యావత్ భారతం హర్షం వ్యక్తం చేయగా.. రాజీకియ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 'సోనూ.. నువ్వు సినిమాల్లోనే విలన్.. కానీ రియల్ లైఫ్‌లో మాత్రం సూపర్ హీరో' అంటూ సోషల్ మీడియావేదికగా కొనియాడుతున్నారు. సోమవారం శిఖర్ ధావన్ కూడా సోనూసూద్ చేసిన సాయాన్ని కొనియాడాడు. ట్విటర్ వేదికగా బాలీవుడ్ విలన్‌కు బిగ్ సెల్యూట్ చెప్పాడు. 'సోనూసూద్.. కష్టాల్లో ఉన్న వలసకూలీలను వాళ్ల సొంత ఊళ్లకు తరిలించడానికి నువ్వు చేసిన వీరోచిత ప్రయత్నానికి నా బిగ్ సెల్యూట్.'అని ట్వీట్ చేశాడు.

మాటిస్తున్న ధావన్ భాయ్..

మాటిస్తున్న ధావన్ భాయ్..

అయితే ధావన్ ట్వీట్‌పై సోనూ సూద్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘చాలా థాంక్స్ బ్రదర్. శిఖర్ ధావన్ క్రీజ్‌లో ఉంటే మనం భద్రంగా ఉన్నామనే విషయం యావత్ భారతానికి తెలుసు. అలాగే నేను ప్రతీ వలస కూలీ సురక్షితంగా ఇంటికి చేరామని చెప్పే వరకూ క్రీజ్‌లోనే ఉంటానని మాటిస్తున్నా'అని సోనూసూద్ ట్వీట్ చేశారు. తెలుగు ప్రజలకు కూడా సోనూసూద్ సుపరిచితమే. చాలా సినిమాల్లో ఆయన విలన్‌‌గా నటించారు.

ఆకతాయిలను ఆడుకుంటూ..

లాక్‌డౌన్ చిక్కుకుపోయామని, సాయం చేయాలని ట్వీట్ చేసిన వెంటనే సోనూసూద్ స్పందిస్తున్నారు. తాను ఏర్పాటు చేసిన బస్సుల్లో ఇంటికి తరలిస్తున్నారు. అయితే ఇదే అదునుగా తీసుకున్న కొంతమంది ఆకతాయిలు పిచ్చి పిచ్చి విన్నపాలు చేస్తున్నారు. వాటికి ఈ బాలీవుడ్ విలన్ కూడా తనదైన శైలిలో బదులిస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. తాజాగా ఓ నెటిజన్ ‘సోనూ భాయ్.. నేను మా ఇంట్లో ఇరుక్కుపోయాను. లిక్కర్ షాప్‌ వరకు వెళ్లేందుకు నాకు సాయం చేయవా' అని కొంటె ట్వీట్ చేశాడు. దీనికి ‘మద్యం షాపు నుంచి ఇంటికి వెళ్లడానికైతే సాయం చేస్తాను. అది నీకు అవసరమైతే చెప్పు'అంటూ అంతే కొంటేగా సోను సూద్ బదులిచ్చారు. ఆయనిచ్చిన ఈ సమాధానానికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

 నా గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు తీసుకెళ్లవా..

నా గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు తీసుకెళ్లవా..

మరో ఆకతాయి తన ప్రియురాలి వద్దకు తీసుకువెళ్లాలని ట్వీట్ చేశాడు. ‘బ్రదర్ నా ప్రియురాలు బిహార్‌లో ఉంది. నన్ను ఆమె దగ్గరకు తీసుకెళ్లవా'అని విజ్ఞప్తి చేశాడు. దీనికి సోనూ సూద్ ‘కొన్ని రోజులు విడిగా ఉండండి బ్రో.. ఇది మీ బంధానికి కఠిన పరీక్ష'అని బదులిచ్చాడు. సమయస్పూర్తితో సోనూ ఇచ్చిన రిప్లేలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Story first published: Tuesday, May 26, 2020, 17:58 [IST]
Other articles published on May 26, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+