Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఐపీఎల్ ప్లేయర్‌ను అభినందించిన కలియుగ కర్ణుడు సోనూ సూద్!

Sonu Sood praises Karn Sharma for supporting the actor’s foundation
Sonu Sood Praises CSK Star స్పూర్తిగా నిలిచావు... ఫౌండేషన్‌కు Karn Sharma సాయం || Oneindia Telugu

హైదరాబాద్: విలన్‌గా వెండితెరపై కనిపించిన ప్రముఖ నటుడు సోనూ సూద్.. నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఆ దేవుడే సోనూ సూద్ అవతారమెత్తాడా? అనే విధంగా అయన సేవలందిస్తున్నారు. ఫస్ట్ వేవ్ అప్పుడు వేల సంఖ్యలో వలస కూలీలు తమ స్వస్థలాలకు చేర్చారు. విదేశాల్లో ఉన్న వారిని సైతం స్వదేశానికి తీసుకొచ్చారు. విద్యార్థులకు, రైతులకు, కార్మికులకు, ఉద్యోగం కోల్పోయినవారికి.. ఇలా చాలా మంది జీవితాల్లో సోనూ సూద్ వెలుగులు నింపారు.

ప్రస్తుతం సెకండ్ వేవ్ విజృంభిస్తున్న టైమ్‌లోనూ తన స్వచ్చంద సంస్థ ద్వారా అండగా ఉంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, రెమెడెసివర్ ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు ఇలా ఏ సాయం కావాలన్న క్షణాల్లో స్పందిస్తూ బాధితులను ఆదుకుంటున్నారు. ఈ విపత్కర కాలంలో ఆయన సేవలను సాధారణ ప్రజలేగాకుండా సెలబ్రీటీలు కూడా ఉపయోగించుకుంటున్నారు.

థ్యాంక్యూ బ్రదర్..

థ్యాంక్యూ బ్రదర్..

ఇలా అందరిచేత శభాష్ అనిపింపచుకుంటున్న సోనూ భాయ్.. మంగళవారం ఐపీఎల్ స్టార్ కర్ణ్ శర్మ‌పై ప్రశంసల జల్లు కురిపించారు. సోనూ సూద్ ఫౌండేషన్‌కు అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ' సోనూసూద్ ఫౌండేషన్‌కు నిర్విరామంగా సేవలందిస్తున్న కర్ణ్‌శర్మకు ధన్యవాదాలు. దేశంలోనే ఎంతో మంది యువకులకు నీవు మరోసారి స్పూర్తిగా నిలిచావు బ్రదర్. మీలాంటి గొప్ప వ్యక్తులే ఈ ప్రపంచాన్ని అందంగా ప్రశాంతంగా మార్చగలరు'అని సోనూ సూద్ కొనియాడారు

మీరు రియల్ హీరో బ్రో..

మీరు రియల్ హీరో బ్రో..

ఇక సోనూ సూద్ ట్వీట్‌పై కర్ణ్ శర్మ కూడా స్పందించాడు. ఈ దేశానికి సోను భాయ్ రియల్ హీరోనని, ఆయన సేవలను ఇలానే కొనసాగించాలని ఆకాంక్షిస్తూ కామెంట్ చేశాడు. 'నీ దేశానికి నువ్వే నిజమైన హీరో భాయ్. చాలా గొప్ప పనిచేస్తున్న మీకు హ్యాట్సాఫ్. ఇలానే ముందుకు సాగండి బ్రదర్'అని బదులిచ్చాడు. అయితే సోనూ ఫౌండేషన్‌కు కర్ణ్ శర్మ చేసిన సాయం ఏంటనే విషయం మాత్రం ఈ ఇద్దరూ వెల్లడించలేదు. అయితే టీమిండియా మాజీ క్రికెటర్​ సురేశ్​ రైనా, హర్భజన్ సింగ్‌లకు కూడా సోనూ సాయం చేశారు. రైనాకు అడిగిన 10 నిమిషాల్లోనే ఆక్సిజన్​ సిలిండర్​ను పంపిన సోనూ భాయ్.. భజ్జీకి రెమెడిసివర్ ఇంజక్షన్‌ను 15 నిమిషాల్లో అందజేశాడు.

ఏం చేయలేకపోతున్నా..

ఏం చేయలేకపోతున్నా..

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ విలయతాండవం చేస్తుందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని గత నెలలోనే సోనూ సూద్ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. సాయం చేయమని కోరే బాధితుల సంఖ్య చాలా పెరిగిపోయిందని, అందరిని ఆదుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఈ ఉదయం నుంచి నా ఫోన్ తీరిక లేకుండా మోగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల నుంచి వేల సంఖ్యల్లో ఫోన్లు వస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్, మెడిసిన్స్, ఇంజెక్షన్స్ సాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికీ చాలా మందికి సాయం చేయలేకపోయా. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరూ ఇంట్లోనే భద్రంగా ఉండండి. మాస్క్ ధరించండి'అని సోనూ సూద్ గత నెల 16నే ట్వీట్ చేశాడు.

కర్ణ్ శర్మ అన్‌సోల్డ్

కర్ణ్ శర్మ అన్‌సోల్డ్

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత లక్కీ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన కర్ణ్ శర్మ.. ఐపీఎల్ 2021 సీజన్ ఆడలేదు. ఈ సీజన్ కోసం జరిగిన వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజీ కొనుగులు చేయలేదు. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన కర్ణ్ శర్మ.. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆ జట్టు వదులుకుంది. 2013 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడుతున్న కర్ణ్ శర్మ 67 మ్యాచ్‌ల్లో 59 వికెట్లు తీశాడు. 2016‌లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2017 చాంపియన్ ముంబై ఇండియన్స్, 2018 టైటిల్ విన్నర్ సీఎస్‌కే జట్లలో కర్ణ్ శర్మ ఆడాడు. దాంతో అతను లక్కీ స్టార్‌గా గుర్తింపు పొందాడు.

Story first published: Wednesday, May 19, 2021, 15:21 [IST]
Other articles published on May 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+