Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి వల్లే ఈ అద్భుత ప్రదర్శన: సోనాల్ దినుషా

టెయిలెండర్ల సహకారంతోనే అద్భుత ప్రదర్శన చేయగలిగానని శ్రీలంక బ్యాటర్ సోనాల్ దినుషా తెలిపాడు. భారత్‌తో కొలంబో వేదికగా గురువారం ముగిసిన రెండో టెస్ట్‌లో సోనాల్ దినుషా అజేయ శతకంతో శ్రీలంకను ఓటమి నుంచి గట్టెక్కించాడు.

ఈ మ్యాచ్‌లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో శతకాలు సాధించాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో సోనాల్ దినుషా(264 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) జిడ్డు బ్యాటింగ్‌తో భారత విజయవకాశాలు దెబ్బతీసాడు.

చరిత్ర సృష్టించిన సోనాల్ దినుషా.. 67 ఏళ్ల తర్వాత భారత్‌పై అరుదైన ఘనత!

చరిత్ర సృష్టించిన సోనాల్ దినుషా.. 67 ఏళ్ల తర్వాత భారత్‌పై అరుదైన ఘనత!

వారిని గుర్తు చేసుకోవాలి..

ఈ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ టెయిలెండర్లతో పాటు కోచ్‌లు, తల్లిదండ్రుల సహకారాన్ని గుర్తు చేసుకున్నాడు. 'ముందుగా నేను ఈ స్థాయికి చేరడానికి సహాయపడిన వారందరి గురించి చెప్పాలి. మా కోచింగ్ సిబ్బంది.. నా స్కూల్ కోచ్, ప్రావిన్షియల్ కోచ్‌తో పాటు నా కుటుంబ సభ్యులను కూడా గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను.

Sonal Dinusha Credits Sri Lanka Tailenders for His Crucial Knock in Colombo Test Against India

గాలే టెస్ట్‌తో పాటు ఇక్కడ మ్యాచ్‌కు ముందు చేసిన సన్నద్దతే దీనికి ప్రధాన కారణం. ఇక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయనే విషయం నాకు ముందే తెలుసు. అందుకు అనుగుణంగా సాధన చేశాను.

మూడు సెంచరీలు చేయడం..

మా టెయిలెండర్లు కూడా చాలా బాగా సహకరించారు. వాళ్లు బాగా ఆడటం వల్లే నేను పరుగులు చేయగలిగాను. పరిస్థితిని అర్థం చేసుకొని నా వంతుగా అత్యుత్తమంగా ఆడేందుకు ప్రయత్నించాను. ఈ సిరీస్‌లో మూడు సెంచరీ‌లు సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు.. జట్టు కోసం పరుగులు సాధించాలనుకున్నాను. అలా చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.'అని సోనాల్ దినుషా చెప్పుకొచ్చాడు.

బెయిల్స్ కాదు.. ధ్రువ్ జురెల్ స్టంప్స్ మార్చినా ఔటవ్వలేదు!(వీడియో)

Also Read

బెయిల్స్ కాదు.. ధ్రువ్ జురెల్ స్టంప్స్ మార్చినా ఔటవ్వలేదు!(వీడియో)

తొలి ఆసియా ప్లేయర్‌గా..

తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగులు చేసిన సోనాల్ దినుషా.. రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 100, 84 పరుగులు చేశాడు. దాంతో భారత్‌పై మొదటి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.

సంక్షిప్త స్కోర్లు..

భారత్ తొలి ఇన్నింగ్స్ 503/9 డిక్లేర్డ్ (దేవదత్ పడిక్కల్ 117, ధ్రువ్ జురెల్ 115 నాటౌట్)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 290 ఆలౌట్(పసిందు సూర్యబండార 80, సోనాల్ దినుషా 103)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 429/9డిక్లేర్డ్(పసిందు సూర్యబండార 92, కామిందు మెండీస్ 55, సోనాల్ దినుషా 133 నాటౌట్)

Story first published: Thursday, August 27, 2026, 21:55 [IST]
Other articles published on Aug 27, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+