Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: తెలుగు కామెంటేటర్స్ డిష్యూం డిష్యూం!(వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో తెలుగు కామెంటేటర్స్ హనుమ విహారి, తిరుమల శెట్టి సుమన్ మధ్య మాటల యుద్దానికి తెరలేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్లాట్ వికెట్స్‌పై మాత్రమే ఆడుతుందని హనుమ విహారి చేసిన విమర్శలను తిరమల శెట్టి సుమన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా తిప్పికొట్టాడు.

సీఎస్‌కే మ్యాచ్‌కు ముందు పాట్ కమిన్స్, ఆ తర్వాత హెన్రీచ్ క్లాసెన్ చేసిన వ్యాఖ్యలను సుమన్ తన వీడియోలో ప్రస్తావించాడు. ఒక్క మ్యాచ్ ఓడినా తమ దూకుడుని మార్చుకోమని కమిన్స్ స్పష్టం చేయగా.. స్లో పిచ్‌పై కూడా డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లకుండా దూకుడుగానే ఆడాలని నిర్ణయించుకున్నట్లు క్లాసెన్ చెప్పాడని సుమన్ గుర్తు చేశాడు. వరల్డ్ కప్ విన్నర్లయిన పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌లకు పిచ్‌లపై పూర్తి అవగాహన ఉందని, ఆరెంజ్ ఆర్మీకి ఎవరి పాఠాలూ అవసరం లేదని సుమన్ ఘాటుగా బదులిచ్చాడు.

Social Media War Telugu Commentators Hanuma Vihari and T Suman Clash Over SRH s Flat Wicket Remarks

సుమన్ వ్యాఖ్యలపై తాజాగా హనుమ విహారి కౌంటరిచ్చాడు. పచ్చకామెర్లు వచ్చినవాడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం ఒకే జట్టుకు మాత్రమే సపోర్ట్ చేసే వారి మాటలు ఇలానే ఉంటాయని తెలిపాడు. తాను ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా.. దేశం తరఫున టెస్టులు, 100కు పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, రెండు బీజీటీ సిరీస్‌లు గెలిచిన రికార్డు తనకుందని స్పష్టం చేశాడు.

తనను విమర్శించే ముందు ట్రోలర్స్ తమ స్టాట్స్ చూసుకోవాలని, రీచ్ కోసం తన పేరు వాడుకుంటే అభ్యంతరం లేదని విహారి స్పష్టం చేశాడు. తన పేరు వాడుకొని మరిన్ని డబ్బులు సంపాదించుకోండని ఘాటుగా బదులిచ్చాడు.

సోషల్ మీడియా వేదికగా ఇద్దరు తెలుగు కామెంటేటర్స్ వాగ్వాదానికి దిగడం ఇదే తొలిసారి. కామెంట్రీ సమయంలో చాలా చనువుగా ఉండే ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా తిట్టుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మీడియా అటెన్షన్‌తో పాటు తమ ఛానెల్స్ రీచ్ కోసం ఇద్దరూ కావాలనే ఈ గొడవ ప్లాన్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Story first published: Tuesday, May 19, 2026, 13:28 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+