Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గంభీర్‌కు కాస్త సమయమివ్వండి: గంగూలీ

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ అండగా నిలిచాడు. కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీ‌ర్‌కు కాస్త సమయమివ్వాలని సూచించాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోగా.. గంభీర్ నూతన కోచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మెంటార్‌గా వ్యవహరించిన గంభీర్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 12 ఏళ్ల తర్వాత కేకేఆర్‌కు ఐపీఎల్ టైటిల్ అందించాడు. దాంతో టీమిండియా కోచ్‌గా గంభీర్‌ను నియమించాలనే డిమాండ్ వ్యక్తమైంది. కోచ్‌గా గంభీర్ అద్భుత ఫలితాలు సాధిస్తాడని అంతా భావించారు. కానీ టీమిండియా దారుణంగా విఫలమైంది.

Snehasish Ganguly Says We Should Give Gautam Gambhir Some Time Amidst Heavy Criticism

శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్ కోల్పోవడంతో పాటు న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై 3 టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయింది. 8 టెస్ట్‌ల్లో మూడు విజయాలు నమోదు చేయలేక డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది.

ఈ క్రమంలోనే గంభీర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కోచ్‌గా గంభీర్ విఫలమయ్యాడనే వాదన తెరపైకి వచ్చింది. అంతేకాకుండా గంభీర్‌‌ వల్ల టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు తలెత్తాయని, ఆటగాళ్లు చీలిపోయారనే ప్రచారం తెరపైకి వచ్చింది. గంభీర్ వ్యవహారశైలి సీనియర్ ఆటగాళ్లకు నచ్చడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలోనే గంభీర్‌కు కాస్త సమయమివ్వాలని స్నేహశిష్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇప్పడే కోచ్‌గా అతని పని తీరుపై నిర్ణయానికి రావడం సరికాదన్నాడు. 'గంభీర్ కోచింగ్ పట్ల నేను సంతోషంగానే ఉన్నాను. ఎందుకంటే అతని అప్రోచ్ బాగుంది. 12 ఏళ్ల తర్వాత కేకేఆర్‌ను విజేతగా నిలబెట్టాడు. మనమంతా అతనికి కొంత సమయం ఇవ్వాలి. రాహుల్ ద్రవిడ్ తర్వాత గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి కొన్ని నెలలే అవుతుంది.'అని స్నేహశిష్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం గంభీర్ ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌‌‌ను పర్యవేక్షిస్తున్నాడు. కోల్‌కతా వేదికగా మరికాసేపట్లో తొలి టీ20 జరగనుంది. అనంతరం వన్డే సిరీస్ జరగనుండగా.. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఫలితంతో గంభీర్ భవితవ్యం తేలనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో రాణించకపోతే గంభీర్‌పై వేటు పడే అవకాశం ఉంది.

Story first published: Wednesday, January 22, 2025, 15:55 [IST]
Other articles published on Jan 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+