అభిమానులు, మీడియాకు స్మృతి మంధాన కీలక విజ్ఞప్తి
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అభిమానులు, మీడియాకు కీలక విజ్ఞప్తి చేసింది. కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కే కాకుండా టోర్నీ మొత్తానికి హైప్ తీసుకురావాలని కోరింది. జూన్ 12 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఇంగ్లండ్ వేదికగా ప్రారంభం కానుండగా.. భారత్ తమ తొలి మ్యాచ్‌ను పాకిస్థాన్‌తో జూన్ 14న ఆడనుంది.
ఇంగ్లండ్‌తో మూడో టీ20 అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న స్మృతి మంధాన..టీ20 ప్రపంచకప్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. 'కామన్వెల్త్ గేమ్స్ 2022లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ టిక్కెట్లన్నీ చాలా వేగంగా అమ్ముడయ్యాయి. కేవలం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గురించే కాకుండా ఈ టీ20 ప్రపంచ కప్ మొత్తానికి ప్రచారం కల్పించండి.

కేవలం ఒక మ్యాచ్‌కే హైప్ తీసుకురావాల్సిన అవసరం లేదు. భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే చాలా ప్రచారం జరిగింది. చాలా మంది క్రికెట్ అభిమానులు ముందుకు వచ్చి మాకు మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నా. వారి కోసం మేం మంచి ప్రదర్శన ఇవ్వగలమనే నమ్మకం ఉంది.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.
ఇంగ్లండ్‌తో మూడో టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో మూడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్-ఎలో ఉన్న భారత్.. పాకిస్థాన్‌తో మ్యాచ్ తర్వాత జూన్ 17న నెదర్లాండ్స్, 21న దక్షిణాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2025 గెలిచినా.. టీ20ల్లో హర్మన్‌సేన గొప్ప ఫామ్‌లో లేదు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు సిరీస్‌ల్లోనూ ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications