Smriti Mandhana కళ్లు చెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే!(వీడియో)

క్వీన్స్‌టౌన్: టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించింది. న్యూజిలాండ్ మహిళలతో జరుగుతున్న నాలుగో వన్డేలో మంధనా మైమరిపించే డైవ్‌తో బంతిని ఒడిసిపట్టుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడిన న్యూజిలాండ్ బ్యాటింగ్‌కు దిగింది. ఆ జట్టు ఓపెనర్ కమ్ కెప్టెన్ సోఫియా డివైన్(24 బంతుల్లో 6 ఫోర్లతో 32) భారత బౌలర్లపై విరుచుకుపడింది.
చివరకు స్మృతి మంధాన స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగింది. రేణుక సింగ్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్ ఆఖరి బంతిని బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మంధాన ఎడమ వైపు డైవ్ చేసి బంతిని అద్భుతంగా అందుకుంది. మంధాన సూపర్ క్యాచ్‌కు డివైన్ షాక్ అయింది. నిరాశగా పెవిలియన్ బాట పట్టింది. ప్రస్తుతం మంధాన క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్మృతి క్యాచ్ అభిమానులంతా ఫిదా అవుతున్నారు.
సోఫీ డివైన్ ఔటైనా.. మరో ఓపెనర్ సుజీ బేట్స్(41), అమెలియా కెర్(68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. చివర్లో సాటర్‌వైట్(16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మెరుపులు మెరిపించింది. భారత బౌలర్లలో రేణుక సింగ్ రెండు వికెట్లు తీయగా.. మెఘనా సింగ్, రాజేశ్వర్ గైక్వాడ్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు.
ఇక 192 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ షెఫాలీ వర్మ(0), యస్తిక భాటియా(0) డకౌటవ్వగా.. పూజా వస్త్రాకర్(4) నిరాశపరిచింది. క్రీజులో స్మృతి మంధాన(13 బ్యాటింగ్)తో పాటు కెప్టెన్ మిథాలీ రాజ్ (2 బ్యాటింగ్) ఉంది. ఇప్పటికే ఏకైక టీ20 మ్యాచ్‌తో వరుసగా మూడు వన్డేల్లో ఓడిన భారత మహిళలు.. పరువు కోసం పోరాడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications