
ఆకట్టుకున్న జులన్ గోస్వామి
రెండో వన్డేలో టాస్ ఓడిన దక్షిణాఫ్రికా మహిళలు మొదటగా బ్యాటింగ్ చేశారు. భారత సీనియర్ పేసర్ జులన్ గోస్వామి (10-0-42-4) నాలుగు వికెట్లతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా 41 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్ అయింది. లారా గుడాల్ (49) టాప్ స్కోరర్. కెప్టెన్ సునే లూస్ 36 పరుగులతో రాణించింది. లీ, డుఫ్రీజ్, కప్, చెట్టి పూర్తిగా విఫలమయ్యారు. భారత మరో సీమర్ మానసి జోషీ (2/23), స్పిన్నర్ రాజేశ్వరీ గైక్వాడ్ (3/37) ప్రత్యర్థి కోలుకోకుండా దెబ్బతీశారు.

మంధాన హాఫ్ సెంచరీ:
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ స్మృతి మంధాన (80 నాటౌట్; 64 బంతుల్లో 10×4, 3×6) అద్భుత హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. పూనమ్ రౌత్ (62 నాటౌట్; 89 బంతుల్లో 8×4) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 28.4 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ జెమిమా రోడ్రిగ్స్ (9) త్వరగానే పెవిలియన్ చేరినా.. మంధాన, పూనమ్ మరో వికెట్ పడకుండా ఆడుతూ సునాయాస విజయాన్ని కట్టబెట్టారు. ఇద్దరూ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. ప్రొటీస్ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్ ఒక వికెట్ తీసింది.

పదోసారి 50+ స్కోరు:
వన్డే కెరీర్లో 53 వన్డేలాడిన స్మృతి 44.14 సగటుతో 2119 పరుగులు చేసింది. 4 శతకాలు, 18 అర్ధ శతకాలు సాధించింది. ఇందులో 24 మ్యాచుల్లో భారత్ ఛేదనకు దిగింది. దూకుడుగా ఆడే మంధాన వీటిలో 63.26 సగటుతో 1202 పరుగులు చేసింది. 2 సెంచరీలు, 12 అర్ధశతకాలు సాధించింది. అందులో 10 అర్ధశతకాలు వరుసగా సాధించడం ప్రత్యేకం. 2018, మార్చి 15 నుంచి ప్రతి ఛేదనలోనూ ఆమె 50+ స్కోర్లు చేసింది. 67, 52, 86, 53, 73, 105, 90, 63, 74, 80తో విజృంభించింది.

కోహ్లీ చేసింది 5 అర్ధ శతకాలే
ఇంగ్లాండ్‌పై 3.. ఆసీస్, న్యూజిలాండ్‌పై 2.. శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికాపై ఒక్కోసారి స్మృతి మందాన 50+ స్కోరు సాధించింది. పురుషుల క్రికెట్లోనూ ఇలాంటి రికార్డు ఎవరికీ లేకపోవడం గమనార్హం. పాక్ దిగ్గజం జావెద్ మియాందాద్ వరుసగా 9 అర్ధ శతకాలు చేశాడు. అయితే ఆయన కూడా ప్రత్యేకించి ఛేదనల్లో మాత్రం చేయలేదు. ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ కూడా చేసిందీ వరుసగా 5 అర్ధ శతకాలే కావడం విశేషం.
Vijay Hazare Trophy: 185 పరుగులతో చెలరేగిన పృథ్వీ షా.. సౌరాష్ట్ర చిత్తు! సెమీస్‌లో ముంబై!


Click it and Unblock the Notifications












