Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Vijay Hazare Trophy: 185 పరుగులతో చెలరేగిన పృథ్వీ షా.. సౌరాష్ట్ర చిత్తు! సెమీస్‌లో ముంబై!

Prithvi Shaw hits unbeaten 185 against Saurashtra in Vijay Hazare Trophy 2021

ఢిల్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక వన్డే క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2021లో ముంబై కెప్టెన్ పృథ్వీ షా చెలరేగిపోయాడు. ఢిల్లీలోని పాలమ్ ఎ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పృథ్వీ షా భారీ సెంచరీ (185 నాటౌట్; 123 బంతుల్లో 21 ఫోర్లు, 7 సిక్సులు) బాదాడు. షా సెంచరీ చేయడంతో ముంబై జట్టు విజయ్‌ హజారే ట్రోఫీ సెమీస్‌లోకి దూసుకెళ్లింది. సౌరాష్ట్ర నిర్ధేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని ముంబై 41.5 ఓవర్లలోనే చేధించింది. షాకు తోడు యశస్వి జైస్వాల్ (75; 104 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు.

చెలరేగిన పృథ్వీ షా

విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ జట్లపై తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన పృథ్వీ షా.. కీలక మ్యాచ్‌లో మాత్రం 185 పరుగులతో సత్తా చాటాడు. అంతకుముందు ఢిల్లీపై 105 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన షా.. పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్‌లో 227 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. షా ఇటీవల ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. విజయ్ హజారే ట్రోఫీ ఈ సీజన్లో షా ఇప్పటికే 500 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ముంబైతో కర్ణాటక ఢీ

ముంబైతో కర్ణాటక ఢీ

మార్చి 11న విజయ్ హజారే ట్రోఫీ సెమీఫైనల్లో ముంబైతో కర్ణాటక ఢీకొట్టనుంది. కర్ణాటక యువ ఓపెనర్ దేవదత్త్ పడిక్కల్ కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ట్రోఫీలో వరుసగా రెండు అర్ధ శతకాలు, నాలుగు శతకాలు బాదిన పడిక్కల్ 673 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. గత ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ 609 రన్స్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ఐపీఎల్ 2020లో బెంగళూరు తరఫున అదరగొట్టాడు.

రాణించిన షా, యశస్వి

రాణించిన షా, యశస్వి

ఈ మ్యాచులో మొదటగా బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 284 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎ బారోట్ (37), స్నెల్ పటేల్ (30) మంచి ఆరంభం ఇచ్చారు. విశ్వరాజ్ జడేజా (53), సమర్త్ వ్యాస్ (90), చిరాగ్ జాని (53) రాణించారు. ముంబై బౌలర్ షమ్స్ ములానీ 2 వికెట్లు పడగొట్టాడు. సౌరాష్ట్ర నిర్ధేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని ముంబై 41.5 ఓవర్లలో చేధించింది. పృథ్వీ షా, యశస్వి జైస్వాల్ చెలరేగారు. జయదేవ్ ఉనద్కట్ ఒక వికెట్ తీశాడు.

చేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

చేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు

సౌరాష్ట్రపై అజేయంగా 185 పరుగులు చేయడంతో పృథ్వీ షా ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. లిస్ట్ ఏ క్రికెట్ చేజింగ్‌లో ఒక భారతీయుడు సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు షాదే కావడం విశేషం. అంతకుముందు అత్యుత్తమ స్కోర్ 183. 2005లో జైపూర్‌లో శ్రీలంకపై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేశాడు. 10 సంవత్సరాల తరువాత కెప్టెన్ విరాట్ కోహ్లీ 2012లో పాకిస్తాన్‌పై చేశాడు.

India vs England: టీ20 సిరీస్‌ కోసం ప్రాక్టీస్‌.. నెట్స్‌లో చెమటోడ్చిన కోహ్లీసేన!! (వీడియో)

Story first published: Tuesday, March 9, 2021, 20:55 [IST]
Other articles published on Mar 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+