Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫన్ లేదంటే ఏదో తేడా కొడుతున్నట్టే : మంధాన

Smriti Mandhana Says If theres no fun theres something wrong with the girls

సిడ్నీ: తమ జట్టులో ఫన్ లేదంటే ఏదో తేడా కొడుతున్నట్టేనని, మా అమ్మాయిలు దేనికో బాధపడుతున్నారని అర్థమని టీమిండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధాన తెలిపింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో యువ ప్లేయర్లతో నిండిన తమదే అత్యంత సంతోషకరమైన, సరదాగా ఉండే జట్టని ఈ ఫేవరేట్ క్రికెటర్ చెప్పుకొచ్చింది.

సగటు వయసు 23 ఏళ్లే..

ఇక మంధాన చెప్పినట్లే ప్రస్తుత భారత మహిళల జట్టు సగటు వయసు 23 ఏళ్ల లోపే ఉంది. జెమీమా రోడ్రిగ్స్‌, షెఫాలీ వర్మ, రిచా ఘోష్‌ వంటి యుయ ప్లేయర్ల రాకతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో హుషారు, ఫన్ ఎక్కువైంది. ఇదే విషయాన్ని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంధాన చెప్పుకొచ్చింది.

‘మా జట్టు సగటు వయసు చూస్తే.. మా సరదా వాతావరణాన్ని మీరు అంచనా వేయవచ్చు. ఈ వయసులో సరదాలే కదా ఉంటాయి. అలా లేదంటే మా అమ్మాయిలు ఎందుకో బాధపడుతున్నట్టే లెక్క. గత రెండేళ్లుగా మా డ్రెస్సింగ్‌రూమ్‌ ఇలాగే ఉంది. ఇంతకుముందు సరదాగా లేదని చెప్పలేను గానీ టీనేజర్లు వచ్చాక సరికొత్త ఉత్తేజం వచ్చింది. వారు చాలా కొత్తగా ఆలోచిస్తున్నారు. వారికేమీ తెలియదు. నిర్భయంగా ఉంటున్నారు. వారిపై ఎలాంటి ఒత్తిడేమీ లేదు. ఏ మ్యాచ్‌నైనా ఒకేలా చూస్తారు. వారిలోని గొప్ప విషయం అదే' అని మంధాన తెలిపింది.

థాయలాండ్ ఒక్కటే..

థాయలాండ్ ఒక్కటే..

సరదాల విషయానికి వస్తే థాయ్‌లాండ్‌ మాత్రమే తమతో కొంత పోటీపడగలదని ఈ డాషింగ్ ఓపెనర్ తెలిపింది. 'సరదాగా ఎలా ఉండాలో ఈ బృందానికి కచ్చితంగా తెలుసు. యువ క్రికెటర్లను సౌకర్యవంతంగా ఉంచేందుకే ఇదంతా. అందులో నేనూ ఒకర్ని. మేం నృత్యాలు చేస్తాం. పాటలు పాడుతాం. ఇంకా మరెన్నో చేస్తాం. థాయ్‌ మాకు కాస్త పోటీనిచ్చేలా ఉన్నప్పటికీ ఈ ప్రపంచకప్‌లో మాదే సంతోషకరమైన జట్టని అనుకుంటున్నా. మా జట్టు వయసు చూస్తూనే ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. 'అని మంధాన పేర్కొంది.

మహిళా క్రికెట్‌లో ఆ రెండు బెస్ట్ టీమ్స్: బ్రెట్‌ లీ

జెమీమానే లీడర్..

జెమీమానే లీడర్..

ఈ సరదాలకు నాయకత్వం వహించేది యువ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్‌ అని, కాస్త గిటార్‌ వాయించడంలోనూ నైపుణ్యమున్న ఈ యువ క్రికెటర్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌లో అల్లరల్లరి చేస్తుందని మంధాన చెప్పుకొచ్చింది.

మూడు సార్లు సెమీస్‌కు

మూడు సార్లు సెమీస్‌కు

ఇప్పటి వరకు 6 మహిళా టీ20 ప్రపంచకప్‌లు జరగ్గా.. ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు (2010, 2012, 2014, 2018) టైటిల్ గెలుచుకుంది. ఇక ఇంగ్లండ్‌ (2009), వెస్టిండీస్‌ (2018) ఒక్కోసారి విజేతగా నిలిచాయి. గత ఆరు టి20 ప్రపంచకప్‌లలో కలిపి ఓవరాల్‌గా భారత్‌ మొత్తం 26మ్యాచ్‌లు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో గెలిచి, 13 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మూడుసార్లు సెమీఫైనల్స్‌లోకి (2009, 2010, 2018) దూసుకెళ్లింది. అయితే టైటిల్‌ సమరానికి ఒక్కసారీ అర్హత పొందలేకపోయింది. కానీ ఈసారి సెమీఫైనల్‌ అడ్డంకిని దాటడమే కాకుండా కప్పుతో తిరిగి రావాలని కృతనిశ్చయంతో ఉంది. ఇక ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల అమెరికన్‌ డాలర్లు (రూ. 7 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. రన్నరప్‌ జట్టుకు 5 లక్షల డాలర్లు (రూ. 3 కోట్ల 57 లక్షలు) అందజేస్తారు.

Story first published: Wednesday, February 19, 2020, 18:35 [IST]
Other articles published on Feb 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+