For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. వెలుగులోకి పలాష్ ముచ్చల్ సీక్రెట్ ఎఫైర్!

టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి అర్థాంతరంగా ఆగిపోవడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆమె తండ్రి అనారోగ్యంతో వివాహం వాయిదా పడలేదని, స్మృతి మంధాన కాబోయే భర్త, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ రాసలీలలు వెలుగులోకి రావడంతోనే పెళ్లి ఆగిపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

పలాష్ ముచ్చల్ మరొక మహిళతో జరిపిన సీక్రెట్ చాట్ స్క్రీన్‌షాట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వ్యవహారం స్మృతి మంధాన అభిమానులను షాక్‌కు గురి చేసింది. స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల పెళ్లి నవంబర్ 23న సాంగ్లీలో జరగాల్సింది.

ఆ పోస్ట్‌లు తొలగించడంతో..

పెళ్లికి ముందు నిర్వహించిన సంగీత్ వేడుకలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన గుండెపోటు లక్షణాలతో బాధపడటంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. తన తండ్రి ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా పెళ్లి చేసుకోవడం సరికాదని భావించిన స్మృతి మంధాన.. వివాహాన్ని వాయిదా వేయాలని నిర్ణయించుకుందని ఆమె మేనేజర్ ప్రకటించారు.

Smriti Mandhana s Wedding Sparks Controversy After Alleged Chat of Fianc Palash Muchhal Surfaces

ఆ తర్వాత స్మృతి మంధాన సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి పెళ్లికి సంబంధించిన పోస్ట్‌లన్నీ మాయమయ్యాయి. మంధాన తొలగించిందా? లేక హైడ్ చేసిందా? అనే విషయంపై క్లారిటీ లేదు. కానీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచిన నవీ ముంబై మైదానంలో పలాష్ ముచ్చల్ ప్రపోజ్ చేసిన వీడియోను కూడా స్మృతి తొలగించడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పుకార్లను ఖండిస్తూ పలాష్ సోదరి పాలక్ ముచ్చల్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని వేడుకుంది. ఆ కాసేపటికే పలాష్ ముచ్చల్ రాసలీలకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ వెలుగులోకి వచ్చాయి.

వెలుగులోకి పలాష్ రాసలీలలు..

మేరీ డి'కోస్టా అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పలాష్ ముచ్చల్‌కు సంబంధించిన సీక్రెట్ చాట్‌ను పంచుకుంది. ఈ సీక్రెట్‌ చాట్‌లో స్మృతి మంధానతో తన సంబంధం లాంగ్ డిస్టెన్స్ లవ్ అని, ఆమె ఎప్పుడూ క్రికెట్ పర్యటనల్లో బిజీగా ఉంటుందని పలాష్ పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను చాట్ జరుపుతున్న సదరు యువతి అందాన్ని వర్ణించాడు.

తెల్లవారుజామున 5 గంటలకు ముంబైలోని వెర్సోవా బీచ్‌కు రావాలని, స్విమ్మింగ్, స్పాలకు వెళ్లవచ్చని ఆహ్వానించాడు. స్మృతిని నిజంగా ప్రేమిస్తున్నారా? అని సదరు యువతి అడగ్గా.. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అని బదులిచ్చాడు. సినిమా పనిలో గత 3 నెలలుగా బిజీగా ఉన్నానని పేర్కొన్నాడు.

పెళ్లికి ముందే తెలియడంతో..

సరిగ్గా పెళ్లికి ముందే పలాష్ బాగోతం స్మృతి మంధాన ఫ్యామిలీకి తెలిసిందని, ఇది తట్టుకోలేకనే ఆమె తండ్రి అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎంత మేర వాస్తవం ఉందనేది తెలియదు. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం జోరుగా చర్చ జరుగుతుంది. వివాహ వేడుకల్లోనూ ఓ మహిళా డ్యాన్సర్‌తో పలాష్ ముచ్చల్ సన్నిహితంగా ఉన్నాడని, దాంతోనే అతని బాగోతం వెలుగులోకి వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

స్మృతి మంధానను దారుణంగా మోసం చేసిన పలాష్ ముచ్చల్‌పై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలాష్ మోసాన్ని స్మృతి మంధాన తట్టుకోలేకపోయిందని, ప్రస్తుతం ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి వాయిదా వెనుక అసలు నిజం ఏంటనేది? సంబంధిత వ్యక్తులు నోరు విప్పితేనే స్పష్టత రానుంది.

Story first published: Tuesday, November 25, 2025, 16:09 [IST]
Other articles published on Nov 25, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+