Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2026: పవర్‌ఫుల్‌గా ఆర్‌సీబీ.. కానీ ఆ ఒక్కటే పెద్ద దెబ్బ!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2026 సీజన్‌కు రంగం సిద్దమైంది. జనవరి 9 నుంచి ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ఐదు ఫ్రాంచైజీలు తమ సన్నాహకాలను కూడా ప్రారంభించాయి. ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలో ఒకసారి విజేతగా నిలిచిన ఆర్‌సీబీ.. మరో టైటిల్‌పై కన్నేసింది.

అరంగేట్ర సీజన్‌తో పాటు గత సీజన్‌లో ఆర్‌సీబీ పేలవ ప్రదర్శనతో పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే నాలుగో సీజన్‌లో ఎలాగైనా టైటిల్ గెలవాలనే కసితో జట్టును ప్రక్షాళన చేసిన ఆర్‌సీబీకి టోర్నీ ఆరంభానికి ముందే బిగ్ షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ గాయంతో ఈ సీజన్‌కు దూరమైంది. ఆమె స్థానాన్ని సాయలీ సత్ఘరే అనే భారత ఆల్‌రౌండర్‌తో ఆర్‌సీబీ భర్తీ చేసింది. మెగా వేలం తర్వాత ఆర్‌సీబీ బలాలు, బలహీనతలు, తుది జట్టు అంచనాపై ఓ లుక్కెద్దాం.

Smriti Mandhana s Bold New Army RCB Squad Breakdown and Predicted XI for WPL 2026

ఆర్‌సీబీ బలాలు..

1.గ్రేస్ హారిస్, పూజా వస్త్రాకర్, నడిన్ డి క్లెర్క్, శ్రేయాంక పాటిల్‌ వంటి బలమైన ఆల్‌రౌండర్లతో జట్టు బ్యాటింగ్, బౌలింగ్ డెప్త్ పెరిగింది.

2.స్మృతి మంధాన, రిచా ఘోష్, గ్రేస్ హారిస్, జార్జియా వోల్‌లతో కూడిన భీకర బ్యాటింగ్ లైనప్ ఏ బౌలింగ్‌నైనా చీల్చిచెండాడగలదు.

3. శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్, ఇంగ్లండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌లతో స్పిన్ విభాగం పటిష్టంగా ఉంది.

ఆర్‌సీబీ బలహీనతలు

1. ఎల్లీస్ పెర్రీ దూరమవడం ఆర్‌సీబీకి తీరని లోటు. ఆమె అనుభవంతో పాటు నిలకడైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ను మరే ప్లేయర్ భర్తీ చేయలేదు.

2. లారెన్ బెల్, అరుంధతి రెడ్డి వంటి బౌలర్లు ఉన్నప్పటికీ.. డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించే బౌలర్‌ ఎవరా? అనేది సందేహంగా మారింది.

కీలక ఆటగాళ్లు ఎవరంటే..?

కెప్టెన్ స్మృతి మంధాన, విధ్వంసకర వికెట్ కీపర్ రిచా ఘోష్, స్పెషలిస్ట్ స్పిన్ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్, ఓవర్సీస్ ఆల్‌రౌండర్ గ్రేస్ హరిస్ చెలరేగితే ఆర్‌సీబీకి తిరుగుండదు.

ఆర్‌సీబీ తుది జట్టు (అంచనా)

స్మృతి మంధాన, జార్జియా వోల్, దయాలన్ హేమలత, గ్రేస్ హారిస్, రిచా ఘోష్(కీపర్), నడిన్ డిక్లెర్క్, పూజా వస్త్రాకర్, శ్రేయాంక్ పాటిల్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, లారెన్ బెల్/లిన్సే స్మిత్


ఆర్‌సీబీ (మహిళల) పూర్తి జట్టు

స్మృతి మంధాన, రిచా ఘోష్, సాయలీ సత్ఘరే, శ్రేయాంక పాటిల్, జార్జియా వోల్, నడిన్ డి క్లెర్క్, రాధా యాదవ్, లారెన్ బెల్, ప్రేమ రావత్, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, గ్రేస్ హారిస్, గౌతమి నాయక్, ప్రాత్యూష కుమార్, దయాలన్ హేమలత.

Story first published: Monday, January 5, 2026, 11:56 [IST]
Other articles published on Jan 5, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+