Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్మృతి పెళ్లి పెటాకులు?

టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి పెటాకులు అయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆదివారం బెంగళూరు వేదికగా జరగాల్సిన పెళ్లి మంధాన తండ్రి అనారోగ్యంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. వివాహ వేడుకల్లో శ్రీనివాస్ మంధాన చాతి నొప్పికి గురవ్వడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి పెళ్లిని వాయిదా వేసారు.

అంతేకాకుండా స్మృతి మంధాన కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మంధాన సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లికి సంబంధించిన వీడియోలను తొలగించడం చర్చనీయాంశమైంది. పెళ్లికి ముందు పలాష్ ముచ్చల్ ప్రపోజ్ చేసిన వీడియోతో పాటు సహచర క్రికెటర్లతో కలిసి చేసిన రీల్స్‌ను కూడా మంధాన తొలగించింది.

Smriti Mandhana Removes All Wedding Posts Amid Father Shrinivas Hospitalisation

ముఖ్యంగా తమ ఎంగేజ్‌మెంట్‌ను ధ్రువీకరిస్తూ ఇటీవల స్మృతి మంధాన తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. సహచర క్రికెటర్లతో కలిసి 'సమజ్ హో హై గయా' బాలీవుడ్ సాంగ్‌కు స్మృతి మంధాన డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా తన వేలికి ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగ్ చూపించింది. ఇదే వీడియోను స్మృతి సహచర ప్లేయర్స్ జెమీమా, శ్రేయాంక పాటిల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా వారు కూడా ఈ వీడియోను తొలగించడం అనేక సందేహాలకు తావిస్తోంది.

అయితే ఈ వీడియోలను స్మృతి మంధాన డిలీట్ చేసిందా? హైడ్ చేసిందా? అన్నదానిపై క్లారిటీ లేదు. మరోవైపు పలాశ్ ముచ్చల్ ఇన్‌స్టా ఖాతాలో మాత్రం ప్రపోజల్ వీడియో అలానే ఉంది. భారత మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచిన నవీ ముంబై మైదానంలో పలాశ్ ముచ్చల్ ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. మంధాన ఖాతాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు మాయమవడంతో అనేక ఊహగానాలు మొదలయ్యాయి.

స్మృతి పెళ్లి పెటాకులు అయ్యిందా? అనే ప్రచారం మొదలైంది. పెళ్లికి ఆటంకాలు ఎదురవ్వడంతో ఇరు కుటుంబాల మధ్య వివాదాలు తలెత్తాయా? ఈ ఆటంకాలను హెచ్చరికగా భావించి పెళ్లిని వాయిదా వేసుకున్నారా? అనే చర్చ జరుగుతోంది. మరికొందరు మాత్రం దిష్టి తగిలిందనే భావనతో స్మృతి మంధాన పెళ్లికి సంబంధించిన పోస్ట్‌లను తొలగించి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు.

తన తండ్రి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో పెళ్లిని వాయిదా వేసుకోవాలని స్మృతి నిర్ణయించుకున్నట్లు ఆమె మేనేజర్‌ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఈ ఇద్దరూ 2019 నుంచి రిలేషన్‌లో ఉండగా.. గతేడాది అందరికి తెలిసింది.

Story first published: Monday, November 24, 2025, 16:49 [IST]
Other articles published on Nov 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+