మ్యాచ్ మధ్యలో పీరియడ్స్.. స్మృతి మంధాన ఏమన్నారంటే?
దేశం కోసం ఆడుతున్నప్పుడు పీరియడ్స్ నొప్పిని కూడా లెక్కచేయకుండా ఆటపై దృష్టి పెడతామని టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన అన్నారు. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, నీరసం ఉన్నప్పటికీ దేశం కోసం మైదానంలో వంద శాతం శ్రమించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో స్మృతి మంధాన ఈ సున్నితమైన విషయంపై స్పందించారు. మహిళా అథ్లెట్లు మైదానంలో ఎంతటి మానసిక, శారీరక ఒత్తిడిని అధిగమించి రాణిస్తారో తెలియజేశారు.
'సాధారణ రోజుల్లోనే 50 ఓవర్ల మ్యాచ్ లేదా టీ20 మ్యాచ్ ఆడటం శారీరకంగా చాలా శ్రమతో కూడుకున్న పని. అలాంటిది పీరియడ్స్ సమయంలో మ్యాచ్ ఆడటం మరింత కష్టంగా ఉంటుంది. తీవ్రమైన కడుపునొప్పి, నీరసం ఉన్నప్పటికీ దేశం కోసం మైదానంలో వంద శాతం శ్రమించాల్సి ఉంటుంది.
టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు వైట్ జెర్సీ ధరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో పీరియడ్స్ వస్తే.. బట్టలపై మరకలు పడతాయేమో అనే మానసిక ఆందోళన ప్రతి మహిళా క్రికెటర్‌లోనూ ఉంటుంది. ఆటపై దృష్టి పెట్టాలా లేక జెర్సీపై దృష్టి పెట్టాలా అనే గందరగోళం నెలకొంటుంది. కానీ ప్రొఫెషనల్ ప్లేయర్లుగా వాటన్నింటినీ తట్టుకుని ఆడక తప్పదు.

మాకు పీరియడ్స్ ఉన్నాయని మేం మ్యాచ్‌లు ఆడకుండా ఇంట్లో కూర్చోలేం. అలాగే మ్యాచ్ ఓడిపోతే పీరియడ్స్ వల్ల సరిగ్గా ఆడలేకపోయాం అని సాకులు చెప్పలేం. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఆడేటప్పుడు కేవలం ప్రదర్శన మాత్రమే ముఖ్యం.
ఒకసారి ప్యాడ్ ధరించేందుకు పరిగెత్తా. నేను వైట్ జెర్సీ వేసుకోవడంతో అంపైర్‌కు అనుమతించడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. నా పరిస్థితిని ఆమె అర్థం చేసుకున్నారు. ప్రస్తుత రోజుల్లో పీరియడ్స్‌పై టీమ్ మేనేజ్‌మెంట్, ఫిజియోలు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. పీరియడ్స్ నొప్పులను తట్టుకోవడానికి తగిన డైట్, ఎనర్జీ డ్రింక్స్, వైద్య సహాయం అందుబాటులో ఉంటాయి.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చారు. ఐసీసీ రూల్స్‌లో పీరియడ్స్‌కు సంబంధించి ఎలాంటి నిబంధన లేదు.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్-ఎలో ఉన్న భారత్.. పాకిస్థాన్‌తో జూన్ 14న తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 17న నెదర్లాండ్స్, 21న దక్షిణాఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో తలపడుతుంది. భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ 2025 గెలిచినా.. టీ20ల్లో హర్మన్‌సేన గొప్ప ఫామ్‌లో లేదు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌తో జరిగిన రెండు సిరీస్‌ల్లోనూ ఓటమిపాలైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

